Bigg Boss 5 Telugu: రైస్ కుక్కర్ తెచ్చిన తంట.. ప్రియ పై చిందులేసిన శ్వేత.. మీ టోన్ నచ్చలేదంటూ..

|

Oct 16, 2021 | 7:23 AM

బిగ్‏బాస్ సీజన్ 5... ఇంటి సభ్యులలో ఇంకా నామినేషన్స్ హీట్ చల్లారినట్లుగా కనిపించడం లేదు.. ఐదువారాలను పూర్తి చేసుకుని

Bigg Boss 5 Telugu: రైస్ కుక్కర్ తెచ్చిన తంట.. ప్రియ పై చిందులేసిన శ్వేత.. మీ టోన్ నచ్చలేదంటూ..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 5… ఇంటి సభ్యులలో ఇంకా నామినేషన్స్ హీట్ చల్లారినట్లుగా కనిపించడం లేదు.. ఐదువారాలను పూర్తి చేసుకుని ఆరోవారానికి చేరుకుంది. ఈవారం ఇంటి కొత్త కెప్టెన్‏గా విశ్వ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ప్రియతో అడ్డంగా వాదనకు దిగుతుంది శ్వేత.. తప్పు ఒప్పుకుంటూనే మీ టోన్ నచ్చలేదంటూ ప్రియపై ఫైర్ అయ్యింది. ఆ వివరాలెంటో తెలుసుకుందాం..

నిన్నటి ఎపిసోడ్‏లో…. ప్రియ.. రవి, శ్రీరామ్ చంద్రలతో.. కాజల్ గురించి మాట్లాడుతుంది. తన అసలు ప్రోవోకింగ్ చేస్తూ ఉంటుంది. మన దగ్గరకు వచ్చి కూర్చుని.. విశ్వ గురించి నీ అభిప్రాయం చెప్పు అని అడుగుతుంది. మనం ఏదైనా చెప్పేలోపే.. తనే.. నీకు నచ్చలేదా ? అని అడుగుతుంది. అది కాదు అనేలోపే… తను మళ్లీ ఏదో అనేస్తుంది.. అంటే ముందుగానే మనం ఏం మాట్లాడాలో తనే చెప్పేస్తూ ఉంటుంది… అంటూ కామెంట్స్ చేస్తుంది.

ఇక ఆ తర్వాత.. శ్వేత కుక్కర్‏లో రైస్ ఉడుకుతుంటే తీసి పక్కన పెట్టి బ్లాక్ కాఫీ పెట్టుకుని.. కుక్కర్ ఆన్ చేయకుం మర్చిపోయి వెళ్లిపోతుంది. ఇక అది గమనించిన ప్రియా..ఎవరు ఇలా ఆన్ చేయకుండా వెళ్లారు అని అడగడంతో.. శ్వేత పేరు చెప్తారు.. వెంటనే.. నువ్వు కుక్కర్ మళ్లీ పెట్టాలి కదా శ్వేత.. సగంలో ఆగిపోతే రైస్ బాగుంటుందా చెప్పు అని అడుగుతుంది. నేను అది చూడలేదు ప్రియా గారు అని శ్వేత అనగానే.. చూడాలి అని చెబుతున్నాను.. అది బాధ్యత కదా.. నేను చూడకపోతే అలాగే ఉండిపోయేది అని ప్రియ అనగానే… ఐవిల్ అనేస్తుంది. ఇక ప్రియ లోపలికి వెళ్లగానే.. యానీ మాస్టర్ తో ఈ టైమ్ లో లంచ్ పెడతారని అనుకుంటానా.. అయిన అన్నింటికీ రియాక్ట్ అయితే నేను కూడా అవుతాను అంటూ వాదిస్తుంది. అంత అవసరం లేదని.. ఆ టోన్ అవసరం లేదు అంటుది. ఇక విశ్వ వచ్చి.. రోజూ ఇదే టైమ్ కు లంచ్ పెడతారు అనేస్తాడు.. వెంటనే .. నాకు తెలియదు నాది బాత్ రూమ్ టీం అంటూ మళ్లీ లోపలికి వెళ్లి రచ్చ స్టార్ట్ చేస్తుంది. ప్రియాగారు నాకు రైస్ పెట్టిన విషయం నాకు తెలియదు అనగానే.. చూసుకోవాలి..కదా అన్నాను అంతే .. ఎవరు కావాలని చేయ్యరు అంటుంది ప్రియా.. దీంతో శ్వేత అడ్డంగా వాదిస్తుంది.. నేను కావాలని చేయలేదు.. తెలిస్తే చేస్తానా అనగా.. తెలిసి చేశావ్ అనట్లేదు… కానీ చూసుకోవాలి అంటున్న అని ప్రియ చెప్పిన వినిపించుకోదు శ్వేత.. మీ టోన్ నాకు నచ్చలేదు అంటూ వాదన కంటిన్యూ చేస్తుంది. దీంతో ప్రియ కూడా ధీటుగా.. నీకు నచ్చినట్టుగా నేను చెప్పలేను.. నాకు ఎలా వచ్చో అలాగే చెప్తాను అంటూ సీరియస్ అయ్యింది. మొత్తానికి మరోసారి ఇంట్లో గొడవ జరిగింది.

Also Read: Sekhar Kammula: ‘లీడర్’ సీక్వెల్‌లో రానా కాకుండా ఆ స్టార్ హీరోని అనుకుంటున్నారట.. ఇంతకు ఆయన ఎవరంటే..

Varudu Kaavalenu: నయా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన నాగశౌర్య.. ‘వరుడు కావలెను’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..