Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే వరుసగా హౌస్ నుంచి ఒకొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు వాటి రిజల్ట్స్, ప్రేక్షకులు వేస్తున్న ఓట్లును బట్టి ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. 8వ వారం నామినేషన్స్‌లో ఉన్నది ఆరుగురు. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబో ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ సారి బిగ్ బాస్ నుంచి లోబో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. తనదైన మాటలతో.. పంచులతో హౌస్ లో నవ్వులు పూయించిన లోబో.. ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక అందరితో కలివిడిగా ఉంటూ వచ్చిన లోబోకి ఈ సారి ఓట్లు తక్కువ పడ్డాయి. దాంతో లోబో బయటకు రాక తప్పలేదు. దీపావళి సందర్భంగా ఆదివారం ఎపిసోడ్ ఎంతో సందడిగా సాగింది.
ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో హౌస్ లో ఉన్న వారిలో జోష్ పెంచారు. అలాగే మితిమీరిన కంటెస్టెంట్స్ కు క్లాస్ కూడా తీసుకున్నారు నాగ్. ఆ తర్వాత ఆదివారం బిగ్ బాస్ స్టేజ్ పై యాంకర్ సుమ అలాగే దేవరకొండ బ్రదర్స్ సందడి చేశారు. విజయ్ దేవరకొండ -ఆనంద్ దేవరకొండ గెస్ట్ లుగా వచ్చి హౌస్ మేట్స్ లో ఆనందాన్ని రెట్టింపు చేశారు. ఇక చివరగా విజయ్ చేతుల మీదుగా లోబో ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించాడు నాగ్. లోబో ఎలిమినేట్ అవ్వడంతో రవి ఎమోషనల్ అయ్యాడు. రవితోపాటు హౌస్ లో ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :