Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మాములుగా జరగడంలేదు.. కంటెస్టెంట్స్ మధ్య వార్ రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఏ రోజు ఎవరు ఎవరితో గొడవ పడతారో తెలియకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువవుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా హౌస్ మేట్స్ పెద్ద డిస్కషన్ పెట్టుకుంటున్నారు. చివరకు మొన్నటి వరకు ఫెండ్స్ గా ఉన్న షన్ను, సిరి కూడా ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో భాగంగా శ్రీరామచంద్ర, యాంకర్ రవిలు టాస్కులు పూర్తి చేశారు. ఇక నిన్న (గురువారం )జరిగిన ఎపిసోడ్ లో ఆనీ మాస్టర్ ప్రియాంక టాస్క్ ను పూర్తి పూర్తి చేశారు.
ఈ టాస్క్ లో రకరాల లిక్విడ్స్ తాగించారు. పేడ, పెయింట్, ఎగ్ ఇలా అన్ని రకాలుగా తన ఒంటి మీద పోసుకున్నారు. కానీ ఒక్కరు కూడా క్విట్ అవ్వలేదు. అయితే ఈ టాస్క్ లు జరుగుతున్న సమయంలో సిరి షన్ను మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మతాల యుద్ధం జరిగింది. దాంతో సిరి అలిగింది. చివరకు షన్ను సిరికి సారి చెప్పాడు. గుంజిళ్ళు కూడా తీశాడు. అయితే ఉదయం కాగానే మళ్ళీ గొడవ మొదలైంది. అన్నీ మాస్టర్ కు ఇచ్చిన టాస్క్ సమయంలో సిరి బెడ్ రూమ్ లోకి వెళ్లి అందరి బట్టలు బయట పడేసింది. శ్రీరామ్ కూడా అందరి బట్టలను బయట పడేశాడు. తాళం కోసం అందరూ పరిగెడుతున్న సమయంలో విశ్వ, మానస్ మధ్య గొడవలు జరిగాయి. సిరి, ప్రియాంకలు ఒకరినొకరు తోసుకున్నారు. అయితే షన్ను సిరి పై అరవడంతో ఎందుకు అలా అరుస్తున్నావ్ అంటూ సిరి తరుపున జెస్సీ అడుగుతాడు. దానికి షన్ను సిరి, జెస్సీల పై సీరియస్ అయ్యాడు. కావాలంటే వరస్ట్ పర్ఫార్మర్ ఇవ్వండి అంటూ ఫైర్ అయ్యాడు షన్ను. సంచాలక్ కాబట్టి అలా అరిచాను అంటాడు అది తప్పు అయితే నామినేట్ చేయండని అంటాడు. ముందు మీ ఆట మీరు ఆడండి అని షన్ను అంటే.. నువ్ కూడా ముందు నీ ఆట నువ్ ఆడు అని సిరి అంటుుంది. అందరి బట్టలను అలా పడేయడం, ఇనర్స్ బయట పడేయడంతో షన్ను సిరి పై అరుస్తాడు. బట్టలన్నీ తీసి సార్ధమని సిరికి చెప్తాడు. దానికి సిరి నేను తర్వాత చేస్తాను అని మొండికేస్తుంది. ఇదే నీ కారెక్టర్ అంటూ సిరిని అంటాడు షన్ను దాంతో సిరి కన్నీళ్లు పెట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
.