Bigg Boss 5 Telugu: సిరిపై బిగ్ బాస్ అదిరిపోయే కామెంట్స్.. ఎగిరి గంతేసిన వయ్యారి భామ!
బిగ్‌బాస్ సీజన్ 5 ముగియడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టాప్ 5 కంటెస్టెంట్స్‌గా
బిగ్‌బాస్ సీజన్ 5 ముగియడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టాప్ 5 కంటెస్టెంట్స్‌గా మిగిలారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను చూపిస్తున్నాడు బిగ్‌బాస్. మొదటగా.. శ్రీరామచంద్ర జర్నీ వీడియో చూపించగా.. ఆ తర్వాత మానస్.. షణ్ముఖ్, సన్నీ వీడియోస్ చూపించాడు.. ఇక చివరగా.. సిరి జర్నీ వీడియో చూపించాడు బిగ్‌బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
ఇక ఎంట్రీతోనే.. జెస్సీ, షణ్ముఖ్, సిరి కలిసున్న ఫోటోలతో స్వాగతం పలికారు బిగ్‌బాస్. ఇక తన జర్నీ ఫోటోలను చూసి ఆనందంతో గంతులేసింది సిరి. ఇక ఆ తర్వాత సిరిని ప్రశంసలతో ముంచేత్తాడు బిగ్‌బాస్. మీ అనుభవాల పునాదులపై మీకు మీరు సిరి అంటే ఎంటో ప్రపంచానికి చూపాలనే తపన.. కళ్లకు కట్టినట్లుగా అందరికి కనిపించింది. మీ కోపమైనా.. మీ ఇష్టమైనా.. మీ బంధమైనా.. మీరు నమ్మినదాని కోసం మీ గొంతును గట్టిగా వినిపించారు.. ఈ బిగ్‌బాస్ ఇల్లు ఎన్నో భావోద్వేగాల నిధి అయితే అందులోని సిరి మీరు అంటూ సిరిని ప్రశంసలత ముంచేత్తాడు బిగ్‌బాస్.
ఇదిలా ఉంటే.. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా సమాచారం. బన్నీతోపాటు మరికొందరు స్టార్స్ కూడా బిగ్‌బాస్ వేదికపై సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. అందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. దీపికా పదుకొనె రాబోతున్నట్లుగా టాక్. వీరితోపాటు.. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ రామ్ చరణ్ కూడా బిగ్‌బాస్ వేదికపై ప్రేక్షకులను అలరించనున్నారట.
ప్రోమో..
Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..
Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..