Bigg Boss 5 Telugu: మరోసారి సిరికి క్లాస్ తీసుకున్న నాగార్జున… నిల్చొబెట్టి కడిపారేశాడుగా..

| Edited By: Ravi Kiran

Oct 10, 2021 | 8:35 AM

బిగ్ బాస్ సీజన్ 5.. కామెడీ లేకుండానే సాగిపోతుంది. కాంట్రావర్శీలు.. లవ్ ట్రాకులు, డ్రమాలతో.. గొడవలతో అప్పుడే ఐదువారాలు

Bigg Boss 5 Telugu: మరోసారి సిరికి క్లాస్ తీసుకున్న నాగార్జున... నిల్చొబెట్టి కడిపారేశాడుగా..
Bigg Boss
Follow us on

బిగ్ బాస్ సీజన్ 5.. కామెడీ లేకుండానే సాగిపోతుంది. కాంట్రావర్శీలు.. లవ్ ట్రాకులు, డ్రమాలతో.. గొడవలతో అప్పుడే ఐదువారాలు పూర్తిచేసుకుంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికీ ఐదువారాలు గడుస్తున్నాయి. 19 మంది కంటెస్టెంట్స్‏తో మొదలైన ఈ షో.. నలుగురు ఎలిమినేట్ కాగా.. మొత్తం పదిహేను మంది మిగిలారు. ఇక ఐదోవారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఆసన్నమైంది. వీకెండ్ రచ్చ చేయడానికి శనివారం నాగార్జున వచ్చేశారు. అక్టోబర్ 9న జరిగిన ఎపిసోడ్స్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందామా.

రాజా రాజా ది గ్రేట్ రా పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ముందుగా ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఆ తర్వాత రావడంతోనే కంటెస్టెంట్స్‏కు హాయ్ చేప్పిన నాగార్జున. అనంతరం ఇంటి సభ్యుల ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ముందుకు శ్రీరామ చంద్రను బిగ్ బాస్ టైటిల్ ముఖ్యమా.. హమీదా ముఖ్యమా అని ప్రశ్నించగా.. బిగ్ బాస్ టైటిల్ అని చెప్పుకొచ్చాడు. దీంతో హమీదా ఫీల్ అయ్యింది. ఇక అనంతరం సిరి లేపి నిల్చోబెట్టి.. కాసేపు క్లాస్ తీసుకున్నాడు. సిరి నువ్వు అంటూ ఉంటావ్ కదా.. ఒకరు లేనప్పుడు ఒకరి వెనక మాట్లాడొద్దు అంటావ్ కదా.. మరి నువ్వు నీ అడ్డాలో కూర్చుని చేస్తున్నది ఏమిటీ అంటూ ప్రశ్నించాడు నాగార్జున. దీంతో వెంటనే సిరి సమాధానం చెప్పలేక… పెద్దగా నవ్వి తనను తాన సమర్ధించుకుంటుంది. మా ముగ్గురికి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి అలా మాట్లాడాను సర్ అంటూ కవర్ చేసుకుంది. ఇక ఆ తర్వాత సన్నీ నువ్వు రాజువి కాలేకపోవడం చాలా బాధనిపించింది. అయినా నీకు నువ్వే బాహుబలిగా ఫీల్ అయ్యావ్ కదా.. అయితే లాస్ట్ వీక్ నువ్వు చేసి తప్పుల వల్లే ఓడిపోయావు అంటూ సద్ధి చెప్పారు నాగార్జున. మొత్తానికి ఈవారం కూడా సిరికి మరోసారి క్లాస్ తీసుకున్నారు నాగార్జున.

Also Read: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌..! రావణుడి పాత్ర ముగిసింది.. రాముడు కొనసాగుతున్నాడు..?

Maa Elections 2021: ఎన్టీఆర్‌ని రిక్వెస్ట్ చేసిన రాజీవ్‌ కనకాల..! ఏ విషయంలో తెలుసా..?

Maa Elections 2021: ఎక్స్‌ట్రాలు ఆపండి..! నరేశ్‌ వ్యాఖ్యలపై శ్రీకాంత్ సీరియస్‌..