బిగ్‌బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. నిన్నటి ఎపిసోడ్లో కాజల్.. సన్నీకి దిష్టి తీయగా.. సిరి షణ్ముఖ్‌కు దిష్టి తీసింది. అయితే కాజల్‌కు ఎక్కువ క్లోజ్ అవ్వకు అని చెబుతూ ఎప్పటిలాగే హగ్ ఇచ్చుకున్నారు సిరి, షణ్ముఖ్. ఇక మరోవైపు ప్రియాంక వెళ్లిపోవడంతో ఒంటరిగా కూర్చొని బాధపడ్డాడు మానస్. దీంతో కాజల్ , సన్నీ వెళ్లి లవ్ సాంగ్ పాడుతూ టీజ్ చేయగా.. కేవలం మేము ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మానస్. ఇక ఆ తర్వాత మానస్, కాజల్ ఇద్దరూ కలిసి…సన్నీకి.. సిరికి మధ్య లవ్ ట్రాక్ అంటూ కామెడీ చేసుకున్నారు. సిరి కనిపించగానే నీ అలియా భట్ వస్తుందంటూ కామెంట్స్ చేశారు. అయితే వీరి ముచ్చటను గమనిస్తున్న షణ్ముఖ్ తెగ ఫీల్ అయ్యాడు.
ఇక సిరి, షణ్ముఖ్ దగ్గరకు రాగానే హితోపదేశం మొదలుపెట్టాడు. నేను పడుకుంటే ఒకలా.. లేస్తే మరోలా బిహేవ్ చేస్తావ్. వాళ్లు యాక్సెప్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు వినాల్సి వచ్చింనందుకు నాకు కోపం వచ్చింది..ఇంకో రెండు వారాలు ఆ తర్వాత ఇవే నాకు వద్దు.. ఎవరు గేమ్ ఆడుతున్నాడో నీకు తెలియదు.. ఎవరు కొత్తగా ట్రాకులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నీకు తెలియదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. నాకు తెలుసు.. నాతో గేమ్ ఆడేవాళ్లను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని సిరి చెబుతున్నా షణ్ముఖ్ పట్టించుకోలేదు. నేను అలగడం కాదు.. నాకు షేమ్‌గా అనిపిస్తుంది.. నా దగ్గర నుంచి వెళ్లిపో అంటూ సిరి పై మరోసారి ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. దీంతో సిరి సారీ చెప్పింది.
అయితే దీనివలన నాకు లాస్ కాదు.. నీకే లాస్.. నీ క్యారెక్టర్ చాలా దరిద్రంగా బయటకు వెళ్తుంది.. నువ్వు ఎడ్డిదానిలాగే ఉంటున్నావ్.. ఇది ఇద్దరితోనూ ట్రాక్ నడుపుతుందనే పేరు వస్తుంది. మానస్, కాజల్ ఈ ట్రాక్ విషయంలో కావాలని పుష్ చేస్తున్నారు. నువ్ ఇలాంటివి చేస్తే నా పక్కన ఉండొద్దు.. నేను కష్టపడి నా పేరు క్రియేట్ చేసుకున్నా.. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త ట్రాకులు వద్దు.. పింకీ అయిపోయింది ఇప్పుడు నువ్వా ? నీ రెస్పాన్స్.. నీ ఇన్ టెన్షన్ ఏంటో నాకు తెలుసు.. నాకు చెప్పకు.. బయటకు వెళ్తే నువ్ ఎవరో నేను ఎవరో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు షణ్ముఖ్. దీంతో షన్నూ మాటలు అర్థం కాక జుట్టు పీక్కుంది సిరి.
Pushpa Movie: ఊరించి.. ఊరించి ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్.. నిరాశలో అభిమానులు.