Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అనంతరం దక్షిణాదిన అడుగు పెట్టిన షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ లోకి అడుగు పెడుతుంది. కరోనా నేపథ్యంలో షో లేట్ అయింది. కాగా బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది. ఈ షో ప్రోమో ఇప్పటికే షూట్ చేసినట్లు .. స్వాతంత్య దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ షో మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను కూడా దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ఎక్కువమంది లేడీస్ కంటెస్టెంట్లు ఉండనున్నారట. షో లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినవారు ఆగష్టు 22 నుండి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత సెప్టెంబర్ 5న కంటెస్టంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే హౌస్ మేట్స్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు కూడా పూర్తి చేసుకున్నాకే బిగ్ హౌస్ లోకి పంపనున్నారు.
అయితే ఇప్పటికే సీజన్ 5 బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు పేర్లు అనేకమందివి వినిపిస్తున్నాయి. ఈసారి సీజన్ లో సందడి చేయడానికి యాంకర్ రవి, లోబో, సినిమా హీరోయిన్ ఇషా చావ్లా, నవ్య స్వామి, యూట్యూబ్ నిఖిల్, డాన్సర్ ఆనీ మాస్టర్, జబర్దస్త్ వర్షిని, సీరియల్ ఆర్టిస్ట్ విజే సన్నీలు దాదాపుగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరోపక్క యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్ రాబోతున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ వీరే సీజన్ 5 లో సందడి చేసే కంటెస్టెంట్లు అంటూ ఎవరి పేర్లు అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: భరతమాత విముక్తి కోసం పోరాడిన వీర నారీమణులు.. చరిత్రలో మరుగున పడిన వీరి గురించి తెలుసుకుందాం