రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు.. ప్రతీ ఇంట్లోనూ బిగ్ బాస్ మోతే! అందరి కళ్లూ.. ఆ ఇంట్లో ఏం జరుగుతుందనే దానిపైనే ఉన్నాయి! ఎవరి ఆట… ఎలా ఉంటుందనే టెన్షన్ అందరిలోనూ ఉంది. బిగ్ బాస్ 7 కాస్త మెల్లిగానే టేకాఫ్ అయినప్పటికీ.. వీకెండ్స్‌లో.. నామినేషన్లో మాత్రం పీక్స్‌లోకి వెళుతోంది. శివాజీ, షకీలా, అమర్ దీప్, ప్రియాంక, తేజ, సింగర్ దామిని మినహా అంతగా తెలియని కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షో.. డే బై డే స్లో అండ్ స్టడీగా సాగుతోంది. ఈక్రమంలోనే ఇవ్వాళ్టి ఎపిసోడ్‌తో.. 11వ రోజుకు చేరుకుంది. ఇక ఇవ్వాళ్టి బిగ్ బాస్ సీజన్ 7 హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఇక అంతకు ముందు 10వ రోజు ఎపిసోడ్‌లో.. మాయాపేటిక టాస్క్‌లో రణధీర్ సమూహం.. మహాబలి సమూహంపై విజయం సాధించి సంబరాలు చేసుకుంది. మాయాపేటికను అన్‌లాక్ చేసి మాయాస్త్రంలోని తలో ముక్కను తీసుకుంటారు. ఇక ఈ ముక్కలు.. తీసుకున్న ఆరుగురి నుంచే పవర్ అస్త్ర కోసం పోటీపడే పోటీదారులు ఎంపికవుతారని బిగ్ బాస్ చెబుతారు.
కుక్కతోక వంకర అన్నట్టు.. నిన్న బిగ్ బాస్ ఇచ్చిన పన్షిమెంట్‌ను పట్టించుకోని యావర్ ఇవ్వాళ్టి షో బింగినింగ్‌లోనే.. మళ్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాడు. ప్రియాంక కూడా.. యావర్తో ఇంగ్లీష్‌లోనే మాట్లాడిందే తప్ప.. వారించలేదు. అయితే ఇది బిగ్ బాస్ పట్టించుకోనప్పటికీ.. ఎదో రోజు ఎఫెక్ట్ పడుతుందనే హింట్ వచ్చింది.
ఇక ఈ క్రమంలోనే రణ్‌దీర్ టీంలోని అమర్‌దీప్, శోభా, ప్రియాంక… తేజ నుంచి తమకు అందిన సమాచారం మేరకు.. సందీప్‌తో పవరాస్త్ర గురించి నిజం చెబుతారు. “మాస్టర్.. సప్త సముద్రాలు దాటి పిల్లకాలువలో పడి చచ్చిపోయారు.. ఏడు రోజులు కష్టపడి మీరు సంపాదించిన అస్త్రం లేదు.. లేపేశారు. మీ బ్యాటరీని కోసేయడానికి లేపేశారు”అంటూ.. అమర్‌దీప్ నేరుగా.. లాన్‌లో ఉన్న సందీప్‌కు చెప్పేశాడు. శోభా , ప్రియాంక ఈ సీన్లో కోరస్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే.. సందీప్ రతిక తీసే ఉంటుందంటూ.. అనుమానం వ్యక్తం చేస్తాడు. పవర్ అస్త్రాన్ని బాత్‌రూమ్లో దాచారని తెలిసి.. అందరూ పడుకున్నాక బాత్‌రూమ్‌కు వెళ్లి వెతికేందుకు డిసైడ్ అయ్యాడు. “నా కొడుకు బర్త్ డే ఇవ్వాళ.. వాడికి డెడికేట్ చేసిన అస్త్రాన్ని ఛీప్‌గా కొట్టేయడం ఏంటని?” సందీప్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
కానీ మరో పక్క రతిక, శుభశ్రీ, గౌతమ్, ప్రశాంత్ సందీప్ రూంలో దూరి.. అస్త్రం కోసం బ్యాగ్స్ చెక్ చేస్తారు. ఇక అంతలోనే.. తన రూమ్‌కు వచ్చిన సందీప్.. అక్కడ ప్లవర్ పెటల్స్ పడి ఉండడాన్ని చూసి.. ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. తన కొడుకు కోసం డెడికేట్ చేశా.. అది ఇవ్వకుంటే బాగుండదు.. మరీ ఇంత ఛీపా అంటూ.. ఫైర్ అయ్యారు. అయితే ఛీప్ అని వాడినందుకు తేజు కాస్త ఫీలయ్యాడు. దీంతో సందీప్.. తన రూమ్‌కొచ్చి తన పవరాస్త్రను కాజేశారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటూ.. బిగ్ బాస్ కెమెరాతో మొరపెట్టుకున్నాడు సందీప్. దీంతో హౌస్‌లోని మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ.. పవరాస్త్ర కోసం వెతికే క్రమంలో.. ఫ్రిడ్జ్ కింద ఉందని కనుక్కొని సందీప్‌కు ఇస్తారు. ఇవ్వడమే కాదు.. సందీప్ తో పాటు వారందరూ కలిసి ఆ తరువాత సందీప్ కొడుకు బర్త్ డే విషెస్ చెప్పారు.
కానీ ఇంతలోనే.. పవరాస్త్రను దొంగిలించింది శుభ శ్రీ అని.. తేజ సందీప్‌కు చెబుతాడు. కట్ చేస్తే.. రజనీ మాసీ సాంగ్‌తో.. 11 రోజు మొదలవుతుంది. ఎప్పటిలాగే.. కంటెస్టెంట్స్ అందరూ స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేస్తుందటే.. షకీలా మాత్రం.. వాళ్లందర్నీ చూస్తూ కూర్చుంది. ఇక సరిగ్గా మధ్యాహ్నం 2:45 నిమిషాలు బిగ్ బాస్ మరో టాస్క్ సంబంధించిన అనౌన్స్మెంట్‌తో పాటు.. రెండవ పవరాస్త్రను పొందడం ఎలా అన్నది కంటెస్టెంట్స్ కు వివరించారు. మాయాస్త్ర మిమ్మల్ని రెండవ పవరాస్త్రను పొందే శక్తినిస్తుందంటూ.. చెబుతాడు. గంట సౌండ్ విన్న ప్రతీ సారి.. మహాబలి టీంలోని.. ఒకరు ముందుగా కీ పట్టుకుని.. రణధీర టీంలోని ఎవరైతే పవరాస్త్ర సాధించడానికి అనర్హులో.. తగిన కారణాలు చెప్పి.. వారి దగ్గరి మాయాస్త్ర భాగాలను అదే టీంలో ఉన్న మరొకరి ఇవ్వాల్సి ఉంటుందని..! ఇక ఈ ప్రక్రియ చివర్లో.. రణధీర టీంలోని ఎవరి దగ్గర ఎక్కువ ఎక్కువ మాయాస్త్రాలు ఉంటాయో.. రెండవ పవరాస్త్రను పొందేందుకు కంటెండర్ షిప్‌లో వారు నిలుస్తారని, బిగ్ బాస్ టాస్క్ గురించి వివరించారు.
ఇక ఈ టాస్క్‌లో ఫప్ట్ సౌండ్ వినిపించగానే.. సబ్బు మొదట వెళ్లి.. శోభ దగ్గర ఉన్న మాయాస్త్రను.. యావర్‌కు ఇస్తుంది. యావర్ మోర్ డిజర్వ్ పర్సన్ ఫర్ దిస్ అస్త్ర దెన్ ఆల్ అంటూ.. తన రీజన్ చెప్పింది. ఇక తరువాత వచ్చిన రైతు బిడ్డ.. అమర్ దగ్గర నుంచి పవరాస్త్రను తీసుకుని శివాజీకి ఇస్తాడు. అమర్ కంటే.. శివాజీ మైండ్ గేమ్ ఆడాడని..అమర్ నడుం నొప్పి అంటూ.. గేమ్ ఆడలేదంటూ.. రైతు బిడ్డ తన రీజన్ చెప్పాడు. కానీ ఈ మధ్యలో.. మహాబలి టీంలో.. రతిక కారణంగా చిన్న పాటి రచ్చ మొదలైంది. రతిక 6th ప్లేస్లో వెళుతానని.. చెప్పగా.. అందుకు దామిని.. యాజ్ ఏ కెప్టెన్‌గా నిన్ను 6th ప్లేస్లో పంపించేది లేదని చెబుతుంది. దీంతో.. అసలు ఈ టీంకు క్యాప్టెన్ ఉన్నారా.. అసలు ఈ టీంలో కో ఆర్డినేషనే లేదంటూ.. దామిని పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో దామిని.. వర్సెస్ రతిక అన్నట్టుగా జరిగింది సిట్యూవేషన్ కాస్తా..! అందులోనూ.. ఒక్కాసారిగా సీరియస్ అయిన రతిక ఒక్కసారిగా దామినిపై దూకినంత పని చేసింది. దీంతో దామిని ప్రతీది టీఆర్పీకి కోసమే రతిక చేస్తోందని.. షి ఈజ్ ఏ చైల్డ్ .. విత్ నో బ్రెయిన్ అండ్ రెస్పెక్ట్ అంటూ.. దామిని ఏడ్చేసింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. షో బిగినింగ్ నుంచి.. రతిక చుట్టూ తిరిగిన రైతు బిడ్డ.. ఈ ఇష్యూలో రతికనే తిడుతూ.. దామిని వైపు మాట్లాడాడు.
ఇక వీళ్ల గొడవను కంటిన్యూ చేస్తూ.. లాన్ ఏరియాలో కూడా.. దామినిపై రతిక రెచ్చిపోయింది. మా టీంలో ఉన్న వాళ్లందరూ బఫూన్స్ అని.. ఛీ చెండాలమైన టీం అంటూ.. రెచ్చిపోయింది. దీంతో మహాబలి సమూహంలోని కంటెస్ట్స్ అందరూ.. రతికకే వ్యతిరేకంగా మారిపోయారు. దీంతో సందీప్ ఇనీషియేట్ తీసుకుని.. తనే అందరికీ నెంబర్స్ ఇచ్చి .. వాళ్ల మధ్య గొడవ సద్దుమనిగించే ప్రయత్నం చేశాడు. ఇక ఈ మధ్యలో.. షకీలా కూడా రతికపై కాస్త అసహనం వ్యక్తం చేసింది. కంటెంట్ కోసమే .. ఇలా చేస్తుంది అంటూ కామెంట్ చేసింది. ఇక ఇంతలో.. ఎప్పటి నుంచో గేమ్ ముందుకు తీసుకెళ్లాలని చూసిన సందీప్.. అసహనం కోల్పోయి.. రతిక పైనే సీరియస్ అయ్యాడు. తనతో.. చిన్న పాటి మాటల యుద్దం చేశాడు. ఇక దీంతో దాదాపు అందరూ.. రతికకు కాస్త వ్యతిరేకంగా మారిపోయారు. అంతలోనే గౌతమ్ కాస్త రతికను.. ఒప్పించి గేమ్ ముందుకు తీసుకెళ్లే ప్రతయ్నం చేశాడు.
ఇక ఈ లొల్లి తర్వాత మొదలైన గేమ్లో.. దామిని ప్రియాంక నుంచి పవరాస్త్రను తీసుకుని షకీలాకు ఇచ్చింది. పుల్ రాజా పుల్ టాస్క్‌లో షకీలా యాక్టింగ్ సూపర్‌గా ఉన్నందుకే అస్త్రను ఇచ్చానంటూ దామిని రీజన్ చెప్పింది. కానీ ఈ టాస్క్‌లో మళ్లీ లాస్ట్ లో వెళతానని రతిక మొండికేయడంతో.. శివాజీ యాక్టివయ్యారు. నన్ను బిగ్ బాస్ నుంచి పంపడ్రో అంటూ.. ఫన్ క్రియేట్ చేసే పని చేశాడు. రతిక ఇంకా మొండికేయడంతో.. కూల్‌గా ఉన్న గౌతమ్ కూడా రతికపై సీరియస్ అయ్యాడు. ఇక ఇదంతా చూసిన బిగ్ బాస్ టైం ఇచ్చినా.. టాస్క్ కంప్లీట్ చేయకపోవడంతో.. మహాబలి టీం పై కాస్త సీరియస్ అవుతాడు.
కానీ ఇంతలో అమర్ రతిక తీరుపై సీరియస్ అవుతాడు. తమ కష్టం వేస్ట్ అయిపోయిందటూ.. ఎమోషనల్ అవుతాడు. తనను స్టుప్పిడ్ రీజన్తో తీసేశాడంటూ.. రైతు బిడ్డ పై కామెంట్స్ చేశాడు. బూతులతో రెచ్చిపోయాడు.