వీరిద్దరూ ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్నారు..!

|

Feb 24, 2020 | 9:05 PM

ఓవర్సీస్‌లో కొత్త కంటెంట్ చిత్రాలు అవ్వకపోయినా పర్లేదు..మనసును హత్తుకునే ప్రేమకథలు, ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీస్ అయితే చాలు వాళ్లు కనెక్ట్ అయిపోతారు. కలెక్షన్లను కుండపోతగా కురిపిస్తారు. కానీ మూవీలో మ్యాటర్ లేకపోతే..సూపర్ స్టార్ సినిమా అయినా నిర్దాక్షణ్యంగా  రిజెక్ట్ చేస్తారు.

వీరిద్దరూ ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్నారు..!
Follow us on

ఓవర్సీస్‌లో కొత్త కంటెంట్ చిత్రాలు అవ్వకపోయినా పర్లేదు..మనసును హత్తుకునే ప్రేమకథలు, ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీస్ అయితే చాలు వాళ్లు కనెక్ట్ అయిపోతారు. కలెక్షన్లను కుండపోతగా కురిపిస్తారు. కానీ మూవీలో మ్యాటర్ లేకపోతే..సూపర్ స్టార్ సినిమా అయినా నిర్దాక్షణ్యంగా  రిజెక్ట్ చేస్తారు. ఇటీవల వచ్చిన అల..వైకుంఠపురంలో మూవీ కథ పాతదైనా..పాత్రల విధానం, కథ చెప్పిన విధానానికి వాళ్లు బాగా కనెక్ట్ అయ్యారు. 

ఆ ప్రభావంతో తాజా చిత్రాలకు మంచి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ దక్కుతోంది.  సెన్సుబుల్ చిత్రాలు తీస్తాడన్న పేరున్న శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా హక్కులు ఓవర్సీస్‌లో రూ. 5.5 కోట్లకు అమ్ముడయ్యయి. ఈ మూవీ అక్కడ సేఫ్ అవ్వాలి అంటే 1.5 మిలియన్ వసూలు చేయాలి. ఇది పెద్ద టాస్కే అయినప్పటికి కమ్ముల బ్రాండ్, సాయి పల్లవి రేంజ్ సినిమాకి రెక్కలను తొడిగాయి. ఇక న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న ‘టక్ జగదీష్’ చిత్రం కూడా షూటింగ్ ప్రారంభించకముందే ఓవర్సీస్ రైట్స్ రూ. 3.4 కోట్లుకు అమ్ముడయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ‘నిన్ను కోరి’,  ‘మజిలి’ మూవీస్ బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించడంతో..అతను విదేశీ ప్రేక్షకుల నమ్మకాన్ని సంపాదించాడు. అందుకే సినిమాకు మంచి ప్రైజ్ లభించింది.