A. R. Rahman: సంగీత దిగ్గజం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఏ ఆర్‌ రెహమాన్‌..

| Edited By: Ravi Kiran

Nov 30, 2021 | 5:13 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్‌. రెహమాన్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సంగీత రంగంలో ఆస్కార్‌ అవార్డుతో ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న

A. R. Rahman:  సంగీత దిగ్గజం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి..  అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఏ ఆర్‌ రెహమాన్‌..
Follow us on

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్‌. రెహమాన్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సంగీత రంగంలో ఆస్కార్‌ అవార్డుతో ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఆయన 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ( CIFF) ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. సినిమా, సంగీత రంగాల్లో రెహమాన్‌ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. కైరోలో ఆదివారం సిఫ్‌ ప్రెసిడెంట్‌ మొహమ్మద్‌ హెఫ్జి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కార ట్రోఫీని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సిఫ్‌ వేడుకలో దిగిన ఫొటోలు, ట్రోఫీలను పంచుకుంటూ ఈ అవార్డు అందజేసిన సిఫ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

కాగా ఆఫ్రికాలో అత్యంత పురాతన చలన చిత్రోత్సవంగా కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు పేరుంది. ఈజిప్ట్‌ రాజధాని కైరో ఒపెరా హౌస్‌లో నవంబర్‌ 28న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌లో 63 దేశాల నుంచి 111 చిత్రాలను ప్రదర్శించనున్నారు. అదేవిధంగా పలు ప్రపంచ ప్రీమియర్‌లు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ డిసెంబర్‌ 5న ముగియనుంది. ఇక ‘రోజా’తో కెరీర్‌ ఆరంభించిన రెహమన్‌ 2008లో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికి గాను ఆస్కార్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో పాటు రెండు గ్రామీ అవార్డులు, బాప్టా పురస్కారం, గోల్డెన్‌ గ్లోబ్‌, నేషనల్‌ అవార్డ్స్‌, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు..ఇలా ఎన్నో పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇటీవలే రెహమాన్‌ ’99 సాంగ్స్‌’ సినిమాతో నిర్మాతగా కూడా మారారు.

Ranbir and Alia: మరోసారి పెళ్లి వాయిదా వేసుకున్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు.. కారణాలేంటంటే..

Lakshya Trailer: నాగశౌర్య కోసం రంగంలోకి వెంకటేష్.. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసిన లక్ష్య టీం..

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..