Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshya Trailer: నాగశౌర్య కోసం రంగంలోకి వెంకటేష్.. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసిన లక్ష్య టీం..

యంగ్ హీరో నాగశౌర్య నటించిన లెటేస్ట్ చిత్రం లక్ష్య. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్

Lakshya Trailer: నాగశౌర్య కోసం రంగంలోకి వెంకటేష్.. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసిన లక్ష్య టీం..
Lakshya
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2021 | 9:20 PM

యంగ్ హీరో నాగశౌర్య నటించిన లెటేస్ట్ చిత్రం లక్ష్య. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా మరోసారి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో లక్ష్య మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్ ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. లక్ష్యీ మూవీ ట్రైలర్‏ను వెంకటేష్ చేతుల మీదుగా డిసెంబర్ 1న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్య విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు.

ట్వీట్..

Also Read: Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్‏ప్రైజ్.. రాధేశ్యామ్ వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ లవ్ ఆంథేమ్ ప్రోమ్ రిలీజ్..

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

Kamal Haasan: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్యులు.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

Bigg Boss 5 Telugu Ravi: యాంకర్ రవి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే.. బిగ్‏బాస్ విన్నర్ కంటే ఎక్కువ తీసుకున్నాడా ?..