బుల్లితెరపై ప్రసారమవుతోన్న బిగ్‌బాస్ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి తన వాదనలు వినిపించారు. టీవీ షోలు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ గైడ్‌లైన్స్ పాటించడం లేదన్నారు. మరోవైపు దీనిపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్రం తరఫు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బిగ్‌బాస్ కంటెంట్‌పై ఘాటుగా స్పందించింది. 1970 లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని విమర్శించింది. ప్రతివాదులకు నోటీసుల పై తదుపరి వాయిదా లో నిర్ణయిస్తామని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 11కు వాయిదా వేసింది.
ఓవైపు బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటూనే మరోవైపు కంటెంట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది బిగ్‌బాస్ షో. ఈ రియాలిటీ షోలో బోల్డ్‌నెస్, అశ్లీలత ఎక్కువైందంటూ సీపీఐ నేత నారాయణ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు పలు సందర్భాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ షో బూతులతో నిండిపోయిందని ఘాటు విమర్శలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ షోను చూడలేకున్నామని మండిపడ్డారు. ఒక సందర్భంలో అయితే బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ తో పోల్చారు సీపీఐ నారాయణ.
ఈక్రమంలోనే ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో ఆపేయాలంటూ పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువయ్యిందంటూ ఆరోపిస్తూ అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. షోను వెంటనే ఆపివేయాలంటూ ఈ పిటిషన్లో ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.