Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ షోపై హైకోర్టు కీలక కామెంట్స్… కావాలనే ఇలా చేస్తున్నారా అంటూ ప్రశ్న

|

Oct 12, 2022 | 1:19 PM

ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. అలాగే ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు ఒకటి రెండు ఎపిసోడ్స్ చూస్తామని వ్యాఖ్యనించింది.

Bigg Boss 6 Telugu: బిగ్‏బాస్ షోపై హైకోర్టు కీలక కామెంట్స్... కావాలనే ఇలా చేస్తున్నారా అంటూ ప్రశ్న
Bigg Boss Highcourt
Follow us on

బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ విజయవంతంగా కొనసాగుతుంది. మరోవైపు ఈషోపై దాఖలైన పిటిషన్‏పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. అలాగే ఇందులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు ఒకటి రెండు ఎపిసోడ్స్ చూస్తామని వ్యాఖ్యనించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. హిం, అశ్లీసం, అసభ్యతను ప్రోత్సహించేదిగా బిగ్‏బాస్ షో ఉందని ఆరోపిస్తూ నిర్మాత సామమాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. ఈ షో ప్రదర్శనను వెంటనే ఆపేయాలని కోరారు.

“ఈ కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండానే నేరుగా ప్రసారం చేస్తున్నారని.. అలాగే అందులో పాల్గొనే మహిళలకు గర్భధారణ పరీక్షలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటివి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు మాత్రమే ప్రసారం చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా రాత్రి 9 గంటల నుంచే ప్రసారం చేస్తున్నారు. సెన్సార్ బోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ” పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఇవి కూడా చదవండి

అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు హైకోర్టు స్పందిస్తూ.. ” ఇటీవల నిర్వాహకులే ప్రచారం కోసం ఇలాంటి వివాదాలు సృష్టించుకుంటున్నారని.. అందులో భాగంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారా ? ” అని ప్రశ్నించింది కోర్టు. కేసును పరిష్కారించడానికి ముందు తాము బిగ్‏బాస్ షో చూస్తామని.. అప్పుడు తమకు కొంత అవగాహన వస్తుందని తెలిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది బదులిస్తూ.. తాము ప్రచారం కోసం పీల్ వేయలేదని.. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేమని తెలిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.