Anchor Sreemukhi: అల్లరిచేస్తూ.. సందడి చేసే శ్రీముఖి ఇంట విషాదం.. భావోద్వేగానికి గురైన యాంకర్..

|

Sep 16, 2021 | 11:33 AM

అందంతో చలాకీతనంతో.. తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసే యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం నెలకొంది. ఎప్పుడు అల్లరిచేస్తూ.. సందడి చేసే శ్రీముఖి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది.

Anchor Sreemukhi: అల్లరిచేస్తూ.. సందడి చేసే శ్రీముఖి ఇంట విషాదం.. భావోద్వేగానికి గురైన యాంకర్..
Anchor Sreemukhi
Follow us on

Anchor Sreemukhi: అందంతో చలాకీతనంతో.. తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసే యాంకర్ శ్రీముఖి ఇంట విషాదం నెలకొంది. ఎప్పుడు అల్లరిచేస్తూ.. సందడి చేసే శ్రీముఖి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. శ్రీముఖి అమ్మమ్మ కన్నుమూశారు. దాంతో ఆమె ఇంట ఒక్కసారిగా  విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక ఈ విషయాన్నీ శ్రీముఖి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు శ్రీముఖి. అమ్మమ్మ నుంచి ఎన్నో విషయాలు  నేర్చుకున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు శ్రీముఖి. మీరు నాకు జీవితంలో చాలా విషయాలు నేర్పించారు! మీరు  ఎప్పుడూ సంతోషాన్ని మాకు పంచారు. నీతో డ్యాన్స్ చేయడాన్ని మీరు లేరు.. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా. మీతో  కలిసి పాటలు పాడటాన్నినేను మిస్ అవుతున్నా.మీరంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో నేను విన్న గొప్ప ప్రేమకథలో మీది, తాతయ్యది ఒకటి. మీరు కచ్చితంగా తాతయ్యను కలుసుకుంటారు. మీ ఇద్దరి లవ్ స్టోరీ మళ్లీ కొనసాగుతుంది’ అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది శ్రీముఖి.

ఇక శ్రీముఖి అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు బుల్లితెర పై కూడా రాణిస్తుంది. ఇటీవలే శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పలు టీవీషోలకు హోస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఇక శ్రీముఖిని పలువురు యాంకర్లు ఇండస్ట్రీకి సంబందించిన వారు సోషల్ మీడియా ద్వారా పరామర్శిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : దూకుడు పెంచిన మహేష్.. సూపర్ స్పీడ్‌లో సర్కారు వారిపాట షూటింగ్..

Gully Rowdy Pre Release Event: థియేటర్లలో సందడి చేయనున్న రౌడీ.. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో..

F3 Movie: స్పీడ్ పెంచనున్న వెంకీ- వరుణ్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సింగిల్ షెడ్యూల్‌లోనే ..