బుల్లితెర క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ రానుంది. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 7 సీజన్లను పూర్తి చేసుకొని ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈఈ సెలబ్రిటీ ఎంటర్ టైన్మెంట్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం కూడా వారానికో సారి ప్రోమోను రిలీజ్ చేస్తూ కొత్త సీజన్ పై హైప్ పెంచుతోంది. ఇప్పటికే రెండు ప్రోమోలతో పాటు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కొత్త లోగోనూ ఆడియెన్స్ ముందుకు తెచ్చింది యాజమాన్యం. తాజాగా కొత్త సీజన్ కు సంబంధించి మరో ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో ఎంతో అందంగా కనిపించారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. అలాగే అందమైన అమ్మాయిలతో ఆయన ఎనర్జిటిక్ గా స్టెప్పులేయడం ప్రోమోకే హైలెట్ గా నిలిచింది. ‘ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు..బిగ్‌బాస్ సీజన్-8లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్‌లు, ట్విస్ట్‌లు బోలెడన్ని ఉంటాయంటూ కొత్త సీజన్ పై క్యూరియాసిటీ పెంచేశారు నాగ్.
అంతకుముందు ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ బిగ్ బాస్ కొత్త లోగోనూ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ రివీల్ చేయలేదు మేకర్స్. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియలో శర వేగంగా సెట్ పనులు జరుగుతున్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. బర్రెలక్క, అబ్బాస్, రాజ్ తరుణ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, టాలీవుడ్ సీనియర్ నటి సనా, రోహిత్ తదితరుల పేర్లు ఈసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Hello All! Presenting the much-awaited promo of SEASON 8! 🎉 This time, we’re taking entertainment to a whole new level with thrills, surprises, and drama like never before. #BiggBossTelugu8 @disneyplushstel @iamnagarjuna pic.twitter.com/PEMR6rWPMM
— Starmaa (@StarMaa) August 11, 2024
We are bringing entertainment back with a BANG !!!!💥
Presenting the logo for the epic Season 8 of Bigg Boss!
Are you ready for an Infinity of fun and entertainment?! #BiggBossTelugu8 @StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/9Du8wdsa0Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి