Sudigali Sudheer: ఆ ఇద్దరు నటులతో కలిసి మాస్కోలో సుడిగాలి సుధీర్ సందడి.. ఎందుకు వెళ్లారంటే..
సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్థస్ట్ కామెడీ షో
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) .. బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్థస్ట్ కామెడీ షో ద్వారా సుధీర్ తెగ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా యూత్‌లో సుడిగాలి సుధీర్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిన విషయమే. ఇటు తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన సుధీర్.. హీరోగా మారేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ గాలోడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే ఇటీవల విడుదలైన గాలోడు మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఇందులో సుధీర్ ఊర మాస్ లుక్కులో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సుధీర్ మాస్కోకు వెళ్లాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్ స్టా స్టోరీలో ఫోటోస్ షేర్ చేశాడు. అయితే సుధీర్ షేర్ చేసిన ఫోటోలలో అతనితోపాటు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. భూపాల్ రాజ్ కూడా ఉన్నారు.
వీరు ముగ్గురు కలిసి మాస్కోలో సందడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరు మాస్కోకు ఎందుకు వెళ్లారనేది తెలియరాలేదు. మరో ప్రాజెక్ట్ షూటింగ్లో భాగంగా వెళ్లారా ? లేదంటే.. గాలోడు సినిమాలో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల షూటింగ్ కోసం వెళ్లారా ? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై రాణిస్తూ ఫుల్ బిజీగా మారాడు సుడిగాలి సుధీర్.
Shilpa Shetty: శిల్పాశెట్టి బహిరంగ ముద్దు వివాదం.. షాకింగ్ తీర్పునిచ్చిన కోర్టు..
Maheshwari: ఆ విషయంలో డైరెక్టర్ నన్ను చీట్ చేశాడు.. ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్..
Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..