ప్రముఖ బుల్లితెర నటి మధుమితపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ మూసివేసిన రహదారిపై తన కొత్త కారును డ్రైవ్ చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. అంతటితో ఆగకుండా మోటార్ సైకిల్ నడుపుతున్న పోలీసు అధికారిపైకి దూసుకెళ్లింది. దీంతో చెన్నైలోని ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళ సీరియల్ ‘ఎతిర్నీచల్’ ఫేమ్ మధుమిత వారం క్రితం కొత్తగా కొన్న కారును డ్రై చేసుకుంటూ వెళ్లి ఓ దేవాలయాన్ని సందర్శించింది. అనంతరం షోలింగనల్లూర్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో అక్కరై మీదుగా ECRకి వెళ్లడానికి ప్రయత్నించింది. దీంతో వన్-వే స్ట్రెచ్‌లో రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేసి, ఎదురుగా బైక్ నడుపుతున్న పోలీసు కానిస్టేబుల్‌ను ఢీ కొట్టింది. కానిస్టేబుల్‌ను సెమ్మంచెరి పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌గా గుర్తించారు. బైక్‌పై నుంచి కిందపడటంతో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు తీవ్రంగా శిథిలమయ్యాయి. గాయాలపాలైన రవికుమార్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అందించారు.
కానిస్టేబులే ర్యాష్ గా డ్రైవింగ్ చేసిటన్లు మధుమిత వాదించింది. దీనిపై ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు మధుమితపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం, గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణల కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా మధుమిత తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటిస్తోంది. ‘మనసున మనసై’ అంటూ తెలుగువారి మనసు దోచేసిన ఈ బుల్లితెర నటి మధుమిత ప్రస్తుతం జీ తెలుగులో ‘నెం.1 కోడలు’ పాత్రలో నటిస్తోంది. అందం, అమాయకత్వం కలబోసిన మధుమిత ‘సరసు’గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. భిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మధుమిత జీవితంలో స్థిరపడటమే తక్షణ కర్తవ్యమని, ప్రేమ-పెళ్లి జీవితంలో వాటంతట అవే జరిగిపోతాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బెంగళూరులో పుట్టిపెరిగిన మధుమిత తమిళ, తెలుగు భాషల్లో సీరియల్స్‌లో నటిస్తుంది. తాజాగా కారు కొని, ఆ కారులో బయటికి వచ్చి ఇలా వివాదంలో ఇరుక్కుంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.