తమిళ స్టార్ హీరో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్ కు అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు విజయ్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. సినిమాల్లోనూ.. బిజినెస్.. యాడ్స్ తోపాటు.. అభిమానుల విషయంలో అంతా రజినీ కాంత్ వారసుడు అంటుంటారు.. గత పది సంవత్సరాలలో విజయ్ దాదాపు 15 సినిమాల్లో నటించాడు. అందులో తొమ్మిది చిత్రాలు… రూ. 100 కోట్లకు పైగా వసూలు చేశాయి. అలాగే.. బిగిల్, సర్కార్, మెర్సల్, మాస్టర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్ల వసూలు చేశాయి. ఈరోజు (జూన్ 22) విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా.. తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు ఇవే.
మాస్టర్..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా నటించాడు. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
బిగిల్..
స్పోర్ట్స్ నేపథ్యంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ పోషించాడు. దాదాపు 100 రోజులు థియేటర్లలో ప్రదర్శించిన ఈ మూవీ రూ. 290 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ దేశాలలోనూ ఈ మూవీకి రెస్పాన్స్ ఓ రెంజ్ లో వచ్చింది. ఒక్క ఫ్రాన్స్ లోనే 34,000 మంది విక్షీంచి అత్యధిక వసూలు చేసిన మొదటి దక్షిణాది చిత్రంగా బిగిల్ నిలిచింది. సింగపూర్‌లో, మెర్సల్ తర్వాత ఎస్‌జిడి 1.5 మిలియన్ మార్కును దాటిన ఈ మూవీ విజయ్ కెరీర్ లో రెండవది. ఇందులో విజయ్ మహిళల ఫుట్ బాల్ టీం కోచ్ గా నటించాడు.
మెర్సల్..
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. విజయ్ కెరీర్ లో మూడు పాత్రలలో నటించిన మొదటి సినిమా ఇది. ప్రపంచ వ్యాప్తంగా రూ.260 కోట్లు వసూలు చేసింది. మలేషియాలో, దిల్‌వాలే, కబాలి సినిమాల తర్వాత అతి పెద్ద వసూల్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే 15 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి తర్వాత అంత మొత్తంలో వసూలు చేసిన మూడవ అతి పెద్ద చిత్రంగా నిలిచింది.
సర్కార్..
చిత్ర నిర్మాత ఎఆర్ మురగదాస్.. విజయ్ కలయికలో వచ్చిన మూడవ సినిమా సర్కార్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో తమిళనాడులో పెద్ద చర్చకే దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. దేశంలో రూ.100 కోట్ల మార్క్ దాటింది. రామ్ చరణ్ నటించిన రంగ స్థలం సినిమాను కూడా సర్కార్ క్రాస్ చేసింది.
తేరీ..
అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో నటించాడు. ఇందులో విజయ్ డబుల్ రోల్ నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసింది.