Bamba Bakya: సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో ఫేమస్ సింగర్ మృతి..
చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు. బంబా బాక్యా హఠాన్మరణంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ్ ప్లేబ్యాక్ సింగర్ బంబా బాక్యా (Bamba Bakya) మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన బాక్యా.. చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు. 49 సంవత్సరాల బాక్యా.. ఎక్కువగా ఏఆర్ రెహమాన్ సంగీతసారధ్యంలో పాటలు పాడారు. చివరగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఓ సాంగ్ ఆలపించారు. సెప్టెంబర్ 1న రాత్రి బాక్యా అనారోగ్యానికి గురికావడంతో వెంటనే అతడిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు. బంబా బాక్యా హఠాన్మరణంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు బాంబా బాక్యా. ఆయన రజినీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రంలో పులినంగల్ సాంగ్ ఆలపించారు. ఆ తర్వాత సర్కార్ సినిమాలోని సింతాంగరం, పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని పొన్నినది వంటి పలు పాటలు పాడారు. ఆయన ఎక్కువగా ఏఆర్ రెహామాన్ సినిమాల్లోని పాటలు పాడారు. ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయకముందు రెహామాన్ డివోషనల్ సాంగ్స్ పాడేవారు. బాంబా బాక్యా అకాల మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.




Rest In peace brother @bambabakya #bambabakya gone too soon … pic.twitter.com/q2jh1LzQr3
— Santhosh Dhayanidhi (@DhayaSandy) September 1, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.