షాకింగ్‌.. యువ సంగీత దర్శకుడు హఠాన్మరణం

కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. యువ సంగీత దర్శకుడు నవీన్ శంకర్ హఠాత్తుగా మరణించారు. అక్టోబర్ 31న రాత్రి నవీన్‌ ఉన్నట్లుండి అనారోగ్యానికి గురవ్వడంతో

షాకింగ్‌.. యువ సంగీత దర్శకుడు హఠాన్మరణం

Edited By:

Updated on: Nov 02, 2020 | 9:43 AM

Navin Shankar Music Director: కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. యువ సంగీత దర్శకుడు నవీన్ శంకర్ హఠాత్తుగా మరణించారు. అక్టోబర్ 31న రాత్రి నవీన్‌ ఉన్నట్లుండి అనారోగ్యానికి గురవ్వడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో అతడి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. చికిత్స అందిస్తుండగానే నవీన్ కన్నుమూశారు. ఇక కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌గా తేలింది. ( కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 922 కొత్త కేసులు.. 7 మరణాలు)

కాగా 2018లో విసిరి చిత్రానికి సంగీతం అందించిన నవీన్‌.. పలు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ అందించారు. శ్రీకాంత్, చంద్రిక రవి నటించిన థ్రిల్లర్ ఉన్ కాదల్‌ ఇరుందల్‌కి నవీన్ బ్యాక్‌గ్రౌండ్ అందించగా.. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు నవీన్ హఠాన్మరణంతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. చిన్న వయస్సులోనే అనంత లోకాలకు చేరారంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ( కరీబియన్ ప్రాంతాలను బెంబేలెత్తిస్తోన్న ‘ఇటా’)