చిత్రపరిశ్రమలో కోవిడ్ అలజడి.. కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి.. విషాదంలో సినీ వర్గాలు..

|

Apr 28, 2021 | 12:53 PM

Director Thamira:  కరోనా వైరస్ ప్రభావం రోజురోజూకి మరింతగా వ్యాపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితులతోపాటు,

చిత్రపరిశ్రమలో కోవిడ్ అలజడి.. కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి.. విషాదంలో సినీ వర్గాలు..
Thamira
Follow us on

Director Thamira:  కరోనా వైరస్ ప్రభావం రోజురోజూకి మరింతగా వ్యాపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితులతోపాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఒక్కరిని కూడా వదలకుండా వ్యాపిస్తోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీ నుంచి సైతం రోజుకో చేదు వార్త వినాల్సి వస్తుండటం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనాతో మరణించగా.. తాజాగా తమిళ డైరెక్టర్ దర్శకుడు తమిర (53) కరోనాతో కన్నుముశారు. గత 20 రోజుల క్రితం ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోని మంగళవారం మధ్యాహన్నం ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమే తమిర మరణానికి కారణమని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే.. తమిళ లెజండరీ దర్శకులు కె.బాలచందర్ తోపాటు మరికొందరు అగ్ర దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. వాళ్ళ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో ఆయన తెరెకెక్కించిన ‘రెట్టసూజి’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన 2018లో సముద్రఖని, రమ్య పాండియన్ ప్రధాన పాత్రల్లో ‘ఆన్ దేవతై’ సినిమా రూపొందించారు. ఇండస్ట్రీలో అందరితో ఆప్యాయంగా మెదిలే దర్శకుడు తమిర ఇకలేరనే వార్త కోలీవుడ్‌లో విషాదం నింపింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.

Also Read: నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..

Happy Birthday Samantha: పెళ్లి తర్వాత కూడా తగ్గని అక్కినేని కోడలు హావా… బర్త్ డే గర్ల్ బ్యూటిఫుల్ పిక్స్..

Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…

కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..