‘నెపోటిజం’పై తాప్సీ సమాధానం.. ప్రేక్షకులకు సూటి ప్రశ్న

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తరువాత నెపోటిజం మళ్లీ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌లోని నెపోటిజం వలనే సుశాంత్‌, ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.

నెపోటిజంపై తాప్సీ సమాధానం.. ప్రేక్షకులకు సూటి ప్రశ్న

Edited By:

Updated on: Jul 05, 2020 | 12:32 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తరువాత నెపోటిజం మళ్లీ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌లోని నెపోటిజం వలనే సుశాంత్‌, ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి వారు సైతం బాలీవుడ్‌ కొంత మంది చేతుల్లోనే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పంజాబీ బ్యూటీ తాప్సీ నెపోటిజంపై మాట్లాడింది. తాను కూడా నెపోటిజం బాధితురాలినేని తాప్సీ తెలిపింది.

”ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇక్కడికి వచ్చిన వారికి మొదట్లో అవకాశాలు రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే మొదట్లో నాకు ఆఫర్లు రావడానికి చాలా సమయం పట్టింది. బయటి వాళ్లతో పోలిస్తే సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి అవకాశాలు త్వరగా వస్తాయి. నెపోటిజం వలన నేను కొన్ని సినిమాలు కోల్పోవల్సి వచ్చింది. అలాంటి సందర్భాల్లో చాలా బాధగా ఉంటుంది” అని తాప్సీ వివరించింది. ఇలా జరగడానికి ప్రేక్షకులు కూడా ఒక కారణమని తాప్సీ వెల్లడించింది. ప్రేక్షకులు కొత్త వారితో పోలిస్తే స్టార్‌ వారసుల సినిమాలను చూసేందుకే ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారని ఈ బ్యూటీ తెలిపింది. నెపోటిజంపై కొందరిని టార్గెట్‌ చేయడం కంటే.. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్‌సెట్‌ కూడా మారాలని తాప్సీ వివరించింది.  కాగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లో పెద్దగా సక్సెస్‌ అవ్వలేకపోయిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.