బాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ బూటీల జాబితా తీస్తే అందులో నటి స్వరా భాస్కర్ కచ్చితంగా ఉంటారు. మహిళా సమస్యలపై, సమాజంలో జరిగే విషయాలపై నిర్మోహమాటంగా తన గళాన్ని వినిపిస్తుంటారీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా కొన్ని నెలల క్రితం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్సీ) చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో స్వరా కూడా భాగమైంది. నిరసనకారులకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించింది. అయితే ఇలా చేయడం వల్ల తన ఎండార్స్‌మెంట్ కాంట్రాక్టులు రద్దయ్యాయంటూ తాజాగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
‘సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా నా మనసులో ఉన్న అభిప్రాయాలను తెలియజేశాను. అయితే ఈ కారణంగానే నాతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న చాలా కమర్షియల్ బ్రాండ్లు, ఎండార్స్‌మెంట్ల రద్దయ్యాయి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటూ తమ ప్రాడక్ట్స్‌కు చెడ్డ పేరు తెస్తోందని ఆయా బ్రాండ్ల ప్రతినిధులు నన్ను తొలగించారు. అయితే నేను మాత్రం బాధపడలేదు. ఎందకంటే ఈ దేశంలోని రాజ్యాంగబద్ధమైన విలువల కోసం ఎవరు, ఎలా నన్ను శిక్షించినా నేను వెనకడుగు వేయను’ అని స్వర చెప్పుకొచ్చింది. కాగా ఆమె ఇటీవల ఓ అనాథ బిడ్డను దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తైందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్వర ‘షీర్ ఖుర్మా’ అనే సినిమాలో నటిస్తోంది.
Also Read:
Bandla Ganesh: మరోసారి మంచి మనసు చాటుకున్న బండ్ల గణేశ్.. ఏం చేశారంటే..
S. S. Rajamouli: మీడియాకు క్షమాపణలు చెప్పిన దర్శక ధీరుడు.. కారణం ఇదే..
Puneeth Raj Kumar: అప్పుపై అభిమానంతో.. ఓ అభిమాని నివాళులర్పిస్తూ.. తిరుమల కొండకు పాదయాత్ర