సుశాంత్ మైనపు బొమ్మ తయారీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కళాకారుడు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మైనపు బొమ్మను లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసేందుకు అతడి అభిమానులు

సుశాంత్ మైనపు బొమ్మ తయారీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కళాకారుడు

Edited By:

Updated on: Sep 18, 2020 | 6:02 PM

Sushant Wax statue: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మైనపు బొమ్మను లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసేందుకు అతడి అభిమానులు ఆన్‌లైన్ క్యాంపెయిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఈ పిటిషన్‌పై సంతకం చేశారు. ఇక ఇది కార్యరూపం దాల్చేందుకు చాలా సమయమే పట్టనుంది. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకేసి సుశాంత్ మైనపు బొమ్మను తయారు చేశారు ప్రముఖ మైనపు బొమ్మల తయారీ కళాకారుడు సుకంతో రాయ్‌. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కి చెందిన ఈ కళాకారుడు తన ఇంట్లో ఈ బొమ్మను తయారు చేశారు.

ఈ సందర్భంగా సుకంతో రాయ్‌ మాట్లాడుతూ.. ”సుశాంత్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మరణించడం నన్ను బాధించింది. నా మ్యూజియం కోసం ఈ బొమ్మను తయారు చేశా. ఒకవేళ సుశాంత్ కుటుంబం కావాలంటే వారి కోసం ప్రత్యేకంగా ఓ బొమ్మను తయారు చేస్తా” అని తెలిపారు. ఇదిలా ఉంటే సుశాంత్ కేసులో సీబీఐ, ఎన్సీబీ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి సుశాంత్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అభిమానులు కోరుతున్నారు.

Read More:

‘ఛలో అంతర్వేది’కి అనుమతుల్లేవు: డీఐజీ

బడా మాల్స్‌, షోరూంలకు జీహెచ్‌ఎంసీ జరిమానా.. ఎందుకంటే

https://twitter.com/ANI/status/1306744511255592960/photo/3