AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడిపై నమ్మకం ఉంచుదాం: ఫ్యాన్స్‌కి సుశాంత్ సోదరి మెసేజ్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి చెంది దాదాపు నెల కావొస్తుంది. అయితే ఆయన మరణాన్ని అభిమానులు, సన్నిహితులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

దేవుడిపై నమ్మకం ఉంచుదాం: ఫ్యాన్స్‌కి సుశాంత్ సోదరి మెసేజ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 13, 2020 | 3:43 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి చెంది దాదాపు నెల కావొస్తుంది. అయితే ఆయన మరణాన్ని అభిమానులు, సన్నిహితులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్‌ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇందుకు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ అభిమానులకు ఆయన సోదరి శ్వేతా సింగ్ కిర్తి సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన శ్వేతా.. ”మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు ఇస్తున్న మద్దతు నన్ను ముగ్ధురాలిని చేసింది. ఈ పరిస్థితుల్లో మీరు మా కుటుంబానికి ఇస్తున్న బలం, మాపై చూపుతున్న ఉదారభావానికి ధన్యవాదాలు చెప్పడం సరిపోదు. దేవుడిపై, ఆయన ఇచ్చే తీర్పుపై నమ్మకం పెట్టుకొందాం. మీరు ఇలానే ప్రార్థించండి” అని తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించారు. వీరి వద్ద నుంచి వారు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం.

Follow Us
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
రికార్డు సృష్టించిన గోల్‌కీపర్ సవిత పూనియా
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
‘కుండ పెరుగు’తో రూ.50 కోట్లు కూడబెట్టాడు.. ఓ రైతుబిడ్డ విజయం
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలకు మొండితనం, పట్టుదల ఎక్కువేనట..!
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
సరిహద్దు దాటితే యుద్ధమే.. పెద్దపులుల సామ్రాజ్య పోరు వెనుక భయంకర న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
‘మీరు 0 నుంచి 9లో ఏ అంకెగా మారాలనుకుంటారు?’ UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే సంచలన నిర్ణయం.. హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
సోనియా గాంధీ ఓటరు జాబితా కేసులో బిగ్ ట్విస్ట్!
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..