Suriya Soorarai Pottru: ఈ నెల 30న ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సూర్య సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)మూవీకి చివర్లో అవాంతరం ఎదురైన విషయం తెలిసిందే. ఈ మూవీ విమానయాన రంగానికి చెందినది కావడంతో నిజమైన ఎయిర్‌ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో షూటింగ్ చేశారు. అయితే వాటికి సంబంధించిన విమానయాన శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసీ) ఇంకా రాకపోవడంతో.. సూరారైపొట్రును వాయిదా వేస్తున్నట్లు సూర్య ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడించారు. జాతీయ భద్రత విషయం కాబట్టి.. ఇండియన్ ఎయిర్‌పోర్స్ నుంచి సర్టిఫికేట్ రావాల్సి ఉందని, మూవీ విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని సూర్య వివరించారు.
అయితే దీనికి సంబంధించిన అడ్డంకులన్నీ తొలిగిపోయాయట. ఈ విషయాన్ని నిర్మాత రాజశేఖర్ పాండియన్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. మా మూవీకి ఎన్‌ఓసీ వచ్చేసింది. అన్బనా అభిమానులు అప్‌డేట్స్ కోసం రెడీగా ఉండండి. కొత్త రిలీజ్ డేట్ వస్తుంది. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటూ దీపాలను హింట్‌గా ఇచ్చారు. అంటే తమిళవాసులు ఎంతో సెంటిమెంట్‌గా భావించే దీపావళి రోజున సూరారై పొట్రు సినిమా రాబోతుందని తెలుస్తోంది.
కాగా ఎయిర్ దక్కన్ ఫౌండర్ జీఆర్ గోపినాథ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సుధాకొంకర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సూర్య సరసన అపర్ణ మురళీ నటించగా.. మోహన్ బాబు, పరేశ్ రావల్, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించిన ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, శిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించింది.
Read More:
ఆ మూవీ నుంచి సాయి పల్లవి ఔట్.. లైన్‌లోకి రష్మిక!
We got the NOC ?????? #SooraraiPottru #AnbaanaFans Get ready for updates and new release date!! Festival of Lights ???
— Rajsekar Pandian (@rajsekarpandian) October 23, 2020