Vijayashanti Birthday: రాముల‌మ్మ‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపిన సూప‌ర్ స్టార్‌.. స్పందించిన విజ‌య‌శాంతి..

Vijayashanti Birthday: ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు సంపాదించుకున్నారు న‌టి విజ‌య‌శాంతి. తెలుగు ఇండ‌స్ట్రీలో దాదాపు అంద‌రు అగ్ర హీరోల‌తో న‌టించిన విజ‌యశాంతి హీరోల‌తో స‌మాన‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు...

Vijayashanti Birthday: రాముల‌మ్మ‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపిన సూప‌ర్ స్టార్‌.. స్పందించిన విజ‌య‌శాంతి..
Vijayashanthi Birthday Mahesh Tweet

Updated on: Jun 24, 2021 | 5:48 PM

Vijayashanti Birthday: ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరు సంపాదించుకున్నారు న‌టి విజ‌య‌శాంతి. తెలుగు ఇండ‌స్ట్రీలో దాదాపు అంద‌రు అగ్ర హీరోల‌తో న‌టించిన విజ‌యశాంతి హీరోల‌తో స‌మాన‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుతెచుకున్న విజ‌య‌శాంతి కెరీర్‌లో పీక్‌లో ఉన్న స‌మ‌యంలోనే రాజ‌కీయాల్లోకి వెళ్లారు. ఇక చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రాముల‌మ్మ‌… స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమాతో ప్రేక్ష‌కుల‌న ఆక‌ట్టుకుంది.
ఇదిలా ఉంటే నేడు (గురువారం) విజ‌య‌శాంతి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంతా విజ‌య‌శాంతికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా విజ‌య‌శాంతికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రిన్స్ ట్వీట్ చేస్తూ.. `హ్యాపీ బ‌ర్త్ డే. విజ‌య‌శాంతి గారు. మీరు ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో ఉండాల‌ని కోరుకుంటున్నాను` అంటూ ట్వీట్ చేశారు. ఇక మ‌హేష్ చేసిన ట్వీట్‌కు స్పందించిన విజ‌య‌శాంతి.. `సూపర్ స్టార్ మ‌హేష్ బాబు గారు. ధ‌న్య‌వాదాలు` అంటూ స్పందించారు.

మ‌హేష్ చేసిన ట్వీట్..

విజ‌య‌శాంతి స్పందిస్తూ చేసిన ట్వీట్‌..

Also Read: Teaser Talk: ‘పేద‌వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా’.? ఆస‌క్తిక‌రంగా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజ‌ర్‌..

MAA Elections: పోటీలో నలుగురు అభ్యర్థులు.. రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు… పదవి పోటీపై క్లారిటీ ఇవ్వనున్న మంచు విష్ణు..

Shahid Kapoor: నాని నటన అద్భుతం.. ‘జెర్సీ’ సినిమా చూసి చాలా సార్లు ఏడ్చేశాను… షాహిద్ కపూర్..