Hero Sandeep kishan: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా షూటింగ్ షూరు చేసిన సందీప్ కిషన్..

|

Jan 27, 2021 | 6:57 AM

విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అలాగే వరుస సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ జోరు మీదున్నాడు ఈ హీరో.

Hero Sandeep kishan: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా షూటింగ్ షూరు చేసిన సందీప్ కిషన్..
Follow us on

విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అలాగే వరుస సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఫుల్ జోరు మీదున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ‘ఏ1 ఎక్స్‏ప్రెస్’ మూవీలో నటిస్తున్న సందీప్ కిషన్.. తాజాగా మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందీప్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు మంగళవారం వైజాగ్‏లో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి వేద వ్యాస్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. అనంతరం ప్రముఖ రైటర్ కోన వెంకట్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. కంకట్ల సిల్క్స్ మల్లిక్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. “ఈ ఏడాది సంక్రాంతికి మా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్లో వచ్చిన మాస్టర్ సూపర్ డూపర్ హిట్ కావడం సంతోషంగా ఉంది. అదే ఉత్సహంతో ఈరోజు విశాఖపట్నంలో కొత్త సినిమాను స్టార్ట్ చేశాం. విభిన్న చిత్రాలను చేయడానికి ముందుకోచ్చిన సందీప్ కిషన్‏తో మరో సరికొత్త సినిమాను మా బ్యానర్లో రూపొందిస్తున్నాం. సందీప్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాతో వేద వ్యాస్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు” అన్నారు. ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఇందులో నటించబోయే నటీనటుల వివరాలను తెలియజేస్తాం అని మహేష్ కోనేరు అన్నారు.

Also Read:

Pawan Kalyan : షూటింగ్ మొదలు పెట్టిన పవన్.. బుల్లెట్ పైన పవర్ స్టార్.. ఆకట్టుకుంటున్న వీడియో