బన్నీకోసం.. సుకుమార్ కష్టాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు లెక్కల మాస్టర్ సుకుమార్. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుండగా.. ఇందుకోసం సుకుమార్ వర్కౌట్లు చేస్తున్నాడు. తన స్క్రిప్ట్‌కు అనుగుణంగా తాను చేసే సినిమాను సెట్స్‌పైకి […]

బన్నీకోసం.. సుకుమార్ కష్టాలు
TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2019 | 5:09 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు లెక్కల మాస్టర్ సుకుమార్. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుండగా.. ఇందుకోసం సుకుమార్ వర్కౌట్లు చేస్తున్నాడు.

తన స్క్రిప్ట్‌కు అనుగుణంగా తాను చేసే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అలవాటున్న ఈ వైవిధ్య దర్శకుడు.. ఇప్పుడు బన్నీ కోసం కోసం చాలానే కష్టపడుతున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో వీరి హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కనుండగా.. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావుతో సుకుమార్ భేటీ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్, ఎన్‌కౌంటర్లు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల డ్యూటీల గురించి ఈ సందర్భంగా అడిగి  తెలుసుకున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఈ మూవీలో లెక్కల మాష్టర్ తన పాత్రలను మలుస్తాడని అంటున్నారు. ‘రంగస్థలం’ వంటి భారీ హిట్ తరువాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu