‘సైరా’ ముందే వచ్చేస్తాడా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దసరాకు కాకుండా గాంధీ జయంతి సందర్భంగా సైరాను రిలీజ్‌ చేయాలన్న ప్లాన్‌లో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు విడుదల చేస్తే లాంగ్ వీకెండ్‌తో పాటు […]

‘సైరా’ ముందే వచ్చేస్తాడా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2019 | 5:04 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానుందని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దసరాకు కాకుండా గాంధీ జయంతి సందర్భంగా సైరాను రిలీజ్‌ చేయాలన్న ప్లాన్‌లో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజు విడుదల చేస్తే లాంగ్ వీకెండ్‌తో పాటు దసరా సెలవులు కలిసి వస్తాయని వారు భావిస్తున్నారట.

అయితే గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉండటంతో అనుకున్న సమయానికి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవుతాయా..? లేదా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరి ‘సైరా’ దసరాకే వస్తాడా..? లేక ముందుగానే పలకరించబోతున్నాడా..? అనే విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu