బన్నీ ‘పుష్ప’.. బాలీవుడ్ నటుడితో సుకుమార్ చర్చలు..!
అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది
Allu Arjun Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. కరోనా, లాక్‌డౌన్ రాకపోయి ఉంటే ఈ పాటికి ఈ మూవీ షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కి వచ్చేది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ మూవీ షూటింగ్ పది శాతం కూడా పూర్తి కాలేదు. ఇక నిదానంగా అన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్తున్న నేపథ్యంలో పుష్ప షూటింగ్‌ని ఈ నెలలో ప్రారంభించేందుకు సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ఏజెన్సీలో సెట్టింగ్స్‌ని వేశారు. ( 14ఏళ్ల తరువాత కలిసి నటించబోతున్న సూర్య, జ్యోతిక)
కాగా ఈ సినిమాలో విలన్‌గా మొదట కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని సుకుమార్ ఖరారు చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూడా ధ్రువీకరించారు. ఆ తరువాత ఈ పాత్ర కోసం పలువురిని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్‌గా ఇప్పుడు బాలీవుడ్ నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. ఇందుకు సంబంధించి ఓ నటుడితో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ నటుడి పేరు బయటకు రాకపోగా.. అతడికి స్క్రిప్ట్ బాగా నచ్చిందని సమాచారం. ఒకవేళ అతడు ఓకే చెప్తే ఈ నెల నుంచి మొదలు కానున్న పుష్ప షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు టాక్. మరి పుష్పకు విలన్‌గా ఎవరు ఖరారు కానున్నారు అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ( కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,607 కొత్త కేసులు.. 6 మరణాలు)
ఇదిలా ఉంటే ఈ మూవీలో అల్లు అర్జున్, లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనుండగా.. ఆయన సరసన రష్మిక రొమాన్స్ చేయనుంది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ( Bigg Boss 4:నీ ఫ్రెండ్‌షిప్ వద్దన్న మెహబూబ్.. సొహైల్‌కి కట్టలు తెంచుకున్న కోపం)