‘శ్రీదేవి సోడా సెంటర్’ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న సుధీర్ బాబు కొత్త సినిమాను మొదలుపెట్టాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది చిత్రబృందం. ఈ సందర్భంగా సెట్లోని ఒక వర్కింగ్ స్టిల్‌ను పంచుకుంటూ ‘మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది’ అంటూ క్యాప్షన్ పెట్టింది.
కాగా ఇందులో ఓ సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేలా కనిపించాడు సుధీర్ బాబు. తొలి షెడ్యూల్‌లో భాగంగా ప్రస్తుతం సుధీర్‌తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. కాగా సుధీర్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ సినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫీ చేయనున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఇతర తారగణం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
An Action Extravaganza loading! ???@isudheerbabu from the sets of @SVCLLP‘s #ProdNo5 ?️?
KICKSTARTED the 1st Schedule??
& Arriving in Never Before Multi-shaded Avatar⚡?#Sudheer15 @HARSHAzoomout @chaitanmusic @pgvinda #NarayanDasNarang #PuskurRamMohanRao pic.twitter.com/mZNtkn9QSX
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) December 27, 2021
Also Read: