Rajamouli: ‘ఆ హీరోను కించపరచడం నా ఉద్దేశ్యం కాదు’.. రాజమౌళి క్లారిటీ.. ఇంతకీ అతడెవరంటే?

|

Jan 15, 2023 | 5:19 PM

ఆయా పరిస్థితులను బట్టి..! సమయం సందర్భాన్ని బట్టి! అప్పుడు మన స్టేట్‌ ఆఫ్ మైండ్‌ను బట్టి.. మూడ్‌ను బట్టి.. ! మనకు తెలియకుండానే మనం కొన్ని మాటలు అనేస్తుంటాం..!

Rajamouli: ఆ హీరోను కించపరచడం నా ఉద్దేశ్యం కాదు.. రాజమౌళి క్లారిటీ.. ఇంతకీ అతడెవరంటే?
Rajamouli
Follow us on

ఆయా పరిస్థితులను బట్టి..! సమయం సందర్భాన్ని బట్టి! అప్పుడు మన స్టేట్‌ ఆఫ్ మైండ్‌ను బట్టి.. మూడ్‌ను బట్టి.. ! మనకు తెలియకుండానే మనం కొన్ని మాటలు అనేస్తుంటాం..! అలా అప్పుడెప్పుడో జక్కన్న అన్న ఓ మాటే.. ఇప్పుడు బీ టౌన్‌లో అతి పెద్ద కాంట్రవర్సీగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ కూడా ఫీలయ్యారనే టాక్ వచ్చేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన మన జక్కన్న తన మాటపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ హీరోను కించపరచడం తన ఉద్దేశ్యం కాదంటూ.. బీటౌన్ పీపుల్స్‌కు ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు.

ఎస్! ప్రభాస్ నటించిన ‘బిల్లా’ ఆడియో ఫంక్షన్‌కు గెస్ట్‌గా వచ్చిన జక్కన్న ఆ ఈవెంట్లో… వేలాదిగా వచ్చిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను అడ్రస్ చేస్తూ.. ఫ్లోలో ఓ కామెంట్ చేశారు. ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్ అంటూ అన్నారు. తాను ‘ధూమ్ 2’ చిత్రంలో హృతిక్‌ను చూసి ఆశ్చర్యపోయాయని.. ఇక ఇప్పుడు ‘బిల్లా’ ట్రైలర్ చూశాక ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అంటూ ఆనాడు చేసిన రాజమౌళి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మాటలు బీ టౌన్‌లో రీసౌండ్ చేసే వరకు వెళ్లాయి.

ఇక దీనిపై జక్కన్న తాజాగా క్లారిటీ ఇచ్చారు. ‘ఆ మాటలు పొరపాటున.. ఫ్లోలో అన్నా తప్ప.. హృతిక్‌ను కించపరచడం తన ఉద్దేశ్యం కాదని.. ఆ సమయంలో తాను ఎంచుకున్న పదాలు సరిగ్గా లేదని.. నేను హృతిక్‌ను ఎంతగానో గౌరవిస్తానంటూ’ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. మరోసారి తన హుందాతనంతో.. అందర్నీ ఆకట్టుకున్నారు రాజమౌళి.