
శోభన్ బాబు.. తెలుగు సినిమా రంగంలో సోగ్గాడు. హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో సహజ నటనతో, విభిన్న కంటెంట్ చిత్రాలతో.. వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించిన శోభన్ బాబు చివరి వరకు హీరోగానే వెండితెరపై కనిపించారు. కానీ తన తర్వాత తన కుటుంబ సభ్యులను మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంచారు. హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన శోభన్ బాబు వారసులు మాత్రం ఇతర రంగాల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన పేరు నెట్టింట మారుమోగుతుంది.
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
అందంలో అచ్చం తాతలాగే ఉన్న సురక్షిత్.. హీరోలకు ఏమాత్రం తీసిపోడు. ప్రస్తుతం ఆయన వైద్యరంగంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నారు డాక్టర్ సురక్షిత్. గతంలో ఓ అరుదైన శస్త్ర చికిత్స చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురక్షిత్.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ తాతయ్య శోభన్ బాబు తన కుటుంబ సభ్యులను సినిమా ఇండస్ట్రీకి వద్దని చెప్పలేదని.. కానీ ఆయన కష్టాన్ని చూసి తామే ఆ ప్రయత్నం చేయలేదని అన్నారు.
అలాగే తనకు హీరోగా చాలా పెద్ద ఆఫర్స్ వచ్చాయని.. కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదని అన్నారు. చిన్నప్పటి నుంచి తాను డాక్టర్ కావాలని తమ తాతయ్య ఎంతో కోరుకున్నారని.. అందుకే ఆయన కోరిక ప్రకారమే డాక్టర్ అయ్యానని చెప్పుకొచ్చారు. నిజానికి లుక్, ఫిజిక్ విషయంలో సురక్షిత్ హీరోలకు ఏమాత్రం తీసిపోరు. ప్రస్తుతం సురక్షిత్ చేసిన కామెంట్స్ మరోసారి వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
Sobhan Babu Grand Sonఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?