Kareena Kapoor: ‘సైజ్ జీరో’ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టిన బెబో.. మీరు కూడా ట్రై చేస్తారా?

బాలీవుడ్‌లో హీరోయిన్​ అంటే 'సైజ్ జీరో' ఫిజిక్​ ఉండాల్సిందే! కాస్త బొద్దుగా అయితే చాలు అభిమానులు, మీడియా అందరూ హీరోయిన్లను ట్రోల్​ చేస్తూనే ఉంటారు. రకరకాల రూమర్స్​ పుట్టుకొస్తాయి. అసలు సైజ్​ జీరో అంటే ఏంటి? ఈ సైజ్​ జీరో రూల్​ని ..

Kareena Kapoor: ‘సైజ్ జీరో’ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టిన బెబో.. మీరు కూడా ట్రై చేస్తారా?
Kareena Kapoor

Updated on: Nov 25, 2025 | 7:59 PM

బాలీవుడ్‌లో హీరోయిన్​ అంటే ‘సైజ్ జీరో’ ఫిజిక్​ ఉండాల్సిందే! కాస్త బొద్దుగా అయితే చాలు అభిమానులు, మీడియా అందరూ హీరోయిన్లను ట్రోల్​ చేస్తూనే ఉంటారు. రకరకాల రూమర్స్​ పుట్టుకొస్తాయి. అసలు సైజ్​ జీరో అంటే ఏంటి? ఈ సైజ్​ జీరో రూల్​ని ఎవరు ఫిక్స్​ చేశారు? నలభై ఏళ్లు దాటినా బెబో కరీనా కపూర్ అంత ఫ్రెష్​గా ఎలా కనిపిస్తున్నారు? ఈ విషయాలన్నింటికీ సమాధానాలు చెప్పేశారు ​సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. ఇటీవల ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ఈ అన్ని సీక్రెట్స్ బయటపెట్టారు. ఇంతకీ ఆమె చెప్పిన సమాధానాలేంటో తెలుసుకుందాం..

సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘సైజ్ జీరో అనేది నేను లేదా బెబో (కరీనా) సెట్​ చేసింది కాదు. జస్ట్ యంగ్ గర్ల్ గుడ్ షేప్‌లోకి రావడమే’ అంటూ చెప్పుకొచ్చారు. రుజుతా దివేకర్ బాలీవుడ్ స్టార్స్‌కి ఫేమస్ న్యూట్రిషనిస్ట్. ‘కరీనా డైట్​ మొదలుపెట్టినప్పుడు ఆమెకు 27 ఏళ్లు. ‘తశన్’తో పాటు ‘జబ్ వీ మెట్’ కూడా షూట్ అవుతున్నాయి. కానీ ఆ డైట్ ఏమీ ఎక్స్‌ట్రీమ్ కాదు దాల్, చావల్ (అన్నం), పరాఠాలు లాంటి ఇండియన్ స్టేపుల్స్ తింటూ కరీనా ఫిట్‌గా ఉండేది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు 40లలో కరీనా ఇంకా ‘ఫాబ్’గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల ఎయ్జింగ్ ప్రాసెస్ స్మూత్‌గా జరిగింది. ‘హెల్త్ అండ్ ఫిట్‌నెస్ అంటే లుక్ మాత్రమే కాదు.. కంప్లీట్ లైఫ్. రిలేషన్‌షిప్స్, వర్క్, చిల్డ్రన్, ఓవరాల్ కండక్ట్. బెబో దాన్ని సక్సెస్​ఫుల్​గా మేనేజ్​ చేస్తోంది’ అంటున్నారు రుజుతా.

రుజుతా ప్రకారం, గుడ్ హెల్త్ అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఎక్కువగా తినకూడదదు. కరీనా లాగా ఫాలో చేస్తూ, ఫ్యామిలీ, వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఏ వయస్సులో అయినా చురుగ్గా ఉంటారు. ‘రియల్ వెల్‌నెస్ అంటే బాడీ నీడ్స్‌ని రెస్పెక్ట్ చేయడం, చేంజెస్‌ని హానర్ చేయడం, సెల్ఫ్-లవ్ కలిగి ఉండడం. అది ఫ్యాడ్ కంటే డీపర్’ అంటూ ముగించారు. మరి మీరూ కరీనా కపూర్​లా సింపుల్​ డైట్​ ఫాలో అవుతూ ఫిట్​గా ఉండిపోండి!

Follow Us