NBK 107 టీజర్ విడుదలైనపుడు.. ఇదేంటి ఇలా ఉంది..? గోపీచంద్ మలినేనికి బోయపాటి కానీ పూనాడా ఏంటి అంటూ కామెంట్ చేశారు. అలా కాదంటే అఖండలో మిగిలిపోయిన షాట్స్ కానీ ఇక్కడ వాడేసారా అంటూ ట్రోల్ చేసారు. ఇప్పటి వరకు బాలయ్య సినిమాను గోపీచంద్ ప్రమోట్ చేసిన విధానం కూడా అలాగే ఉంది. కానీ తాజాగా NBK 107 మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటికి వచ్చింది. మరి అదేంటి..?
అఖండతో బ్లాక్‌బస్టర్ అందుకున్న బాలయ్య.. తాజాగా NBK 107తో వస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శృతి హాసన్ మొదటిసారి బాలయ్యతో జోడీ కడుతున్నారు. క్రాక్, బలుపు లాంటి హిట్స్ తర్వాత మరోసారి శృతినే తన సినిమాలో హీరోయిన్‌గా కొనసాగిస్తున్నారు గోపీచంద్. దసరాకు NBK 107ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్బీకే 107 అఖండ తరహాలో సాగే పక్కా మాస్ సినిమా అనుకుంటున్నారంతా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఇస్తున్నారు దర్శకుడు గోపీచంద్. బాలయ్యకు బాగా కలిసొచ్చిన ఓ సెంటిమెంట్ ఈ సినిమా కోసం వాడేస్తున్నారు. అదే సిస్టర్ సెంటిమెంట్.. గతంలో బాలయ్య ఈ సెంటిమెంట్‌తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి లాంటి సినిమాల్లో ప్రధానంగా చెల్లి సెంటిమెంట్ ఉంటుంది. అప్పట్లో ఈ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాయి.
చెన్నకేశవరెడ్డి, లెజెండ్ లాంటి సినిమాల్లోనూ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. కాకపోతే అదే మెయిన్ స్ట్రీమ్‌లో కనిపించదు. తాజాగా గోపీచంద్ మలినేని సైతం ఎన్బీకే 107లో సిస్టర్ సెంటిమెంట్ బాగా దట్టిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో బాలయ్య చెల్లిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. క్రాక్‌లో జయమ్మగా విలనిజం చూపించిన వరలక్ష్మి.. ఈసారి మాత్రం కరుణ రసం పండించబోతున్నారు. బాలయ్య, వరలక్ష్మి మధ్య సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉండబోతున్నాయని తెలుస్తుంది.
అఖండ దాదాపు 75 కోట్ల షేర్ వసూలు చేయడంతో.. గోపీచంద్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. ఇప్పటికే దసరా సీజన్‌లో చిరంజీవి, నాని వస్తున్నారు. ఈ ఇద్దరితో బాలయ్య పోటీకి సై అంటున్నారు. పైగా తనకు అచ్చొచ్చిన సిస్టర్ సెంటిమెంట్‌ను తోడు తెచ్చుకుంటున్నారు. అది వర్కవుట్ అయితే బాలయ్యకు మరో బ్లాక్‌బస్టర్ ఖాయం. మరి చూడాలిక.. ఈ అన్నాచెల్లెల్ల బంధం ఎలా ఉండబోతుందో..?
మరిన్ని సినిమా వార్తలు చదవండి..