Sunitha Singer: సింగర్ సునీత పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందమైన గాత్రం, ఎప్పుడూ నవ్వుతూ ఆకట్టుకునే రూపంతో మెస్మరైజ్ చేసే సునీత, ఇటీవల సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా మారారు. తన ప్రొఫెషనల్ వివరాలతో పాటు, వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు సునీత. రియాలిటీ షోలు, పాటలతో బిజీగా గడిపే సునీత ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వెకేషన్స్‌కు వెళుతుంటుంది. ఈ క్రమంలోనే సరాదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.
తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను పంచుకున్నారు సునీత. కారులో హైవేపై వెళుతోన్న సమయంలో రోడ్డు పక్కన సునీతకు చెరుకు రసం స్టాల్ కనిపించింది. వెంటనే కారులో నుంచి దిగిన సునీత తానే స్వయంగా గానుగను చేత పట్టి తిప్పుతూ చెరుకు రసం తీసింది. దీనంతటినీ వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ.. ‘సునీత గాత్రంలాగే ఆ చెరుకు రసం కూడా ఇంకా తియ్యగా అయిపోతుంది’ అంటూ కామెంట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
PK: ‘పీకే’కు నిజంగానే అంత సీన్ ఉందా..? కొత్త పార్టీ యోచన వార్కౌట్ అవుతుందా..?