ప్రియుడు ఆత్మహత్య.. ఐసీయూలో సింగర్‌ రేణు

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ 10వ సీజన్ ఫేమ్ రేణు నగర్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విన్న రేణు

  • Tv9 Telugu
  • Publish Date - 7:35 am, Sun, 30 August 20
ప్రియుడు ఆత్మహత్య.. ఐసీయూలో సింగర్‌ రేణు

Singer Renu Nagar: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ 10వ సీజన్ ఫేమ్ రేణు నగర్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త విన్న రేణు.. అక్కడికక్కడే కుప్పకూలగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. రేణు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా రాజస్థాన్‌కు చెందిన రేణు సింగర్‌గా మంచి పేరును సంపాదించుకున్నారు. కొన్ని టీవీ యాడ్‌లోనూ ఆమె నటించారు. ఈ క్రమంలో వివాహితుడైన రవి శంకర్ అనే వ్యక్తితో ఆమె ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు జూన్‌లో తమ తమ ఇళ్లలో నుంచి పారిపోయారు. దీనిపై రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను మోసగించి, రవి శంకర్ ఆమెను తీసుకెళ్లాడని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక వారిని వెతికిన పోలీసులు, ఐదు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. మరోవైపు వరుస పరిణామాలతో రవి శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన రేణు ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆమెకు రాజస్థాన్‌ అల్వార్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంగీతం నేర్చుకునే క్రమంలో రేణు, రవి శంకర్‌కి పరిచయమైనట్లు తెలుస్తోంది.

Read More:

ఏపీలో కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1