ఏపీలో కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఈ ఏడాది కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

ఏపీలో కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 7:05 AM

Andhra Pradesh News: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఈ ఏడాది కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీనిపై వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో అనంతపురం మెడికల్ కాలేజీకి 41సీట్లు, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీకి 13 సీట్లు, గుంటూరు మెడికల్‌ కాలేజీకి 2 సీట్లు మంజూరు అయ్యాయి. వీటిలో ఎక్కువ సీట్లు జనరల్‌ మెడిసిన్ కేటగిరిలోనే ఉండటం విశేషం. అయితే పీజీ వైద్య సీట్లు పెరగాలంటే ఆయా మెడికల్ కాలేజీలో మంచి వసతులు ఉండాలి. అప్పుడే భారతీయ వైద్య మండలి కొత్త సీట్లను మంజూరు చేస్తుంది.

ఇక ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం(2021-22)కి మరో 120 సీట్లకు దరఖాస్తు చేయబోతున్నట్లు వైద్య విద్య శాఖాధికారులు తెలిపారు. ఈ సీట్ల పెంపుకు కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు వ్యయం చేస్తాయని వారు వెల్లడించారు. వివిధ కాలేజీల్లో స్పెషాలిటీ కోర్సుల కొరతను బట్టి సీట్లకు దరఖాస్తు చేస్తున్నామని వివరించారు. పీజీ వైద్య సీట్లు పెరగడం వలన వసతులతో పాటు, మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Read More:

Unlock 4.0: పేరెంట్స్ అనుమతితో స్కూళ్లకు వెళ్లొచ్చు..

తెలంగాణ ఇంటర్ డిజిటల్ క్లాసులు.. టైమింగ్స్ ఇవే.