అవును మేమిద్దరం విడిపోయాం: సింగర్ నోయల్‌

టాలీవుడ్‌లో మరో జంట విడిపోయింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి, గతేడాది పెళ్లి చేసుకున్న సింగర్ నోయల్‌, నటి ఎస్తేర్ విడాకులు తీసుకున్నారు.

అవును మేమిద్దరం విడిపోయాం: సింగర్ నోయల్‌

Edited By:

Updated on: Sep 01, 2020 | 11:10 AM

Singer Noel divorced: టాలీవుడ్‌లో మరో జంట విడిపోయింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి, గతేడాది పెళ్లి చేసుకున్న సింగర్ నోయల్‌, నటి ఎస్తేర్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ తమ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ”చాలా రోజుల నిశ్శబ్దం తరువాత అధికారికంగా ఎస్తేర్‌తో నాకు విడాకులు అయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నా. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు కోర్టు తీర్పు కోసం వేచి ఉన్నాం. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో  విడాకులు తీసుకున్నాము. ఎస్తేర్ నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. ఎస్తేర్‌ను గానీ, నా కుటుంబాన్నిగానీ ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అని అభ్యర్థిస్తున్నా. బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉన్న నా కుటుంబం, స్నేహితులు అందరికీ థ్యాంక్స్‌. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది మంచి సమయమని భావిస్తున్నా” అని నోయల్‌ కామెంట్ పెట్టారు.

మరోవైపు ఎస్తేర్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ..  ”గత సంవత్సరంగా నన్ను చాలా మంది అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెబుతున్నా. అధికారికంగా మేము విడాకులు తీసుకున్నాము. లీగల్‌గా ఈ విషయంలో స్పష్టత వచ్చేవరకు ఎదురుచూసి, ఇప్పుడు ప్రకటిస్తున్నా. 2019 జనవరి 3న నోయల్‌, నేను పెళ్లి చేసుకున్నాము. ఆ తరువాత కొద్ది రోజులకే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడిపోయి, గతేడాది జూన్‌లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. మేము వేసిన పిటిషన్‌పై కోర్టు నిన్న తీర్పును ఇచ్చింది. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంతకు ముందులాగే ఇప్పుడు నాకు మద్దతుగా ఉంటారని భావిస్తున్నా. మనం మనుషులం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాం. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టమో అందరికీ తెలుసు. మా ఇద్దరికి సంబంధించి ఇదే నా క్లారిఫికేషన్‌. దయచేసి ఇక ఈ విషయంపై ఇంటర్వ్యూలో, కామెంట్లలో అడగకండి. నాకు మద్దతు ఇచ్చినందుకు, నాకు సహాయం చేసినందుకు, నన్ను ఇష్టపడినందుకు చాలా థ్యాంక్స్” అని కామెంట్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నోయల్‌ బిగ్‌బాస్‌ 4లో పాల్గొనబోతున్నట్లు కూడా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

ఇండో-చైనా దేశాల మధ్య అవగాహన అవసరం, ఎస్.జైశంకర్

వేలంపాట లేకుండానే శోభాయాత్ర మొదలైన బాలాపూర్ గణేషుడు