ఇండో-చైనా దేశాల మధ్య అవగాహన అవసరం, ఎస్.జైశంకర్

భారత-చైనా దేశాల మధ్య సంబంధాలు ఉభయ దేశాలకే కాక, ప్రపంచానికి కూడా ఎంతో ముఖ్యమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.

ఇండో-చైనా దేశాల మధ్య అవగాహన అవసరం, ఎస్.జైశంకర్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 8:15 PM

భారత-చైనా దేశాల మధ్య సంబంధాలు ఉభయ దేశాలకే కాక, ప్రపంచానికి కూడా ఎంతో ముఖ్యమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. రెండు దేశాలూ ఓ అవగాహనకో,  ఒడంబడికకో రావడం అవసరమని ఆయన చెప్పారు. యూఎస్ ఇండియా స్ట్రాటిజిక్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్ నిర్వహించిన ఇంటారాక్ట్ సెషన్ లో పాల్గొన్న ఆయన, చైనా పట్ల మెతక ధోరణితో మాట్లాడారు. ఓ వైపు చైనా దళాలు లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతుంటే మరోవైపు భారత్ ‘బేల’ గా స్పందిస్తోంది. చైనా మన పొరుగు దేశమని, ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరే ఇండియాకూడా ఆ దేశ చర్యపట్ల ఆందోళన వ్యక్తం చేస్తోందని  జైశంకర్ అన్నారు. మన దేశం కూడా అభివృధ్దిలో ఎంతో ఎదుగుతోందని, కానీ చైనాతో పోలిస్తే ఇంకా మనం కొంత వెనుకబడే ఉన్నామన్న ధోరణిలో ఆయన మాట్లాడారు. ఆ దేశానికి మనం మరీ పొరుగునే ఉన్నాం అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తాను రాసిన ‘ఇండియా వే ..స్ట్రాటిజీస్ ఫర్ యాన్ ఆన్ సర్టైన్ వరల్డ్’ అనే పుస్తకాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.