Shruti Haasan: శాంతనుతో రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన్ శ్రుతి.. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశానంటూ..

శ్రుతి హాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల

Shruti Haasan: శాంతనుతో రిలేషన్ షిప్ పై ఓపెన్ అయిన్ శ్రుతి.. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశానంటూ..
Shruti Haasan

Updated on: Jan 10, 2022 | 4:36 PM

శ్రుతి హాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్‏గా కొనసాగిన శ్రుతి హాసన్.. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ మంచి పిక్స్‏లో ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి సినిమాలను వదిలేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి… ఇటీవల రవితేజా సరసన “క్రాక్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ వెంటనే మరోసారి “వకీల్ సాబ్” సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకుంది. దీంతో శ్రుతి హాసన్ మరోసారి వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన “కేజీఎఫ్” ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న “సలార్” సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అదేవిధంగా బాలయ్య 107 సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. అదేవిధంగా చిరంజీవి చిత్రంలోనూ నటించే అవకాశముందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్ గత కొంతకాలంగా శాంతను హజరికా అనే చిత్రకారుడితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా వీరిద్దరి ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో తెగ హల్‏చల్ చేస్తున్నాయి. తాజాగా  వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో క్వి జ్‌లో పాల్గొన్నారు . ఇన్‌స్టాగ్రామ్‌ క్విజ్ లో  పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. అందులో తమ రిలేషన్ షిప్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  ఈ సందర్భంగా తానే మొదట శాంతనుకి ‘ఐ లవ్ యూ’ అని చెప్పినట్లు తెలిపింది. అంతేకాకుండా ఇద్దరిలో ఎవరు బాగా ప్రొటెక్టివ్‌గా ఉంటారని అడగగా.. ఒకరినొకరు చూపించుకున్నారు. అదేవిధంగా శ్రుతి కీన్లినెస్ కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తుందని, శాంతను బాగా తింటాడని చెప్పుకొచ్చారు. కాగా ఈ రొమాంటిక్ జోడీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి నెటిజన్లను ఆకట్టుకుంటోన్న ఈ వీడియోను మీరు కూడా  చూసేయండి.

Also Read: Anand Mahindra: కెన్యా పోలీస్ డిపార్ట్ మెంట్ లో స్కార్పియో మహీంద్రా వెహికిల్స్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు బంద్..

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..