Shruti Haasan: పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్నకు.. కమల్‌ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా..

| Edited By: Pardhasaradhi Peri

Jan 24, 2021 | 2:38 PM

Shruti Haasan: సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా విజయంతో మంచి ఊపుమీదుంది హీరోయిన్ శ్రుతిహాసన్. దీంతో వరుసగా సినిమాలను

Shruti Haasan: పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్నకు.. కమల్‌ కూతురు ఏం సమాధానం చెప్పిందో తెలుసా..
Follow us on

Shruti Haasan: సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా విజయంతో మంచి ఊపుమీదుంది హీరోయిన్ శ్రుతిహాసన్. దీంతో వరుసగా సినిమాలను ఓకె చేస్తుంది. టాలీవుడ్‌లో శ్రుతి నటించిన సినిమాలన్ని దాదాపుగా విజయం సాధించినవే. శ్రుతి హీరోయిన్ మాత్రమే కాకుండా డ్యాన్సర్‌, సంగీత దర్శకురాలు, నిర్మాత ఇలా అన్ని రంగాల్లోనూ అందె వేసిన చేయి. తాజాగా ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఇందులో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది.

ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానంగా ముమ్మాటికీ లేదని తేల్చిచెప్పింది. కారణాలు మాత్రం చెప్పలేదు. ఓ అభిమాని మీరు మీ మాజీ ప్రియుడు మైఖెల్‌ను అసహ్యించుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది. తర్వాత తేరుకొని అసలు నేను ఎవరినీ అసహ్యించుకోను కనుక నా జవాబు లేదని వస్తోందని తెలిపింది. కాకపోతే లోలోపల కొంత బాధపడుతానని మాత్రం చెప్పుకొచ్చింది. మీరు ముక్కుకు సర్జరీ చేయించుకున్నారా? అన్న ప్రశ్నకు అవునని, కానీ ఇదెప్పుడో ఏడేళ్ల క్రితం జరిగిందని, ఇంకా దాన్నే పట్టుకుని వేలాడటం ఆపేయండని సూచించింది. క్రాక్‌ ప్రమోషన్లలో ఎందుకు పాల్గొనడం లేదన్న క్వశ్చన్‌కు బిజీగా ఉన్నానని బదులిచ్చింది.

లోకనాయకుడి కుమార్తెను నేనెందుకు తగ్గుతాను, భారీ రెమ్యూనరేషన్‌పై శృతి ఫోకస్