అప్పుడు సుశాంత్‌తో మాట్లాడనందుకు బాధపడుతున్నా: షోయబ్ అక్తర్‌

| Edited By:

Jun 30, 2020 | 5:50 PM

ఆ సమయంలో సుశాంత్‌తో మాట్లాడి ఉంటే బావుండేదని ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. జీవితంలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కొవాలన్న విషయంపై తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆయన మాట్లాడారు.

అప్పుడు సుశాంత్‌తో మాట్లాడనందుకు బాధపడుతున్నా: షోయబ్ అక్తర్‌
Follow us on

ఆ సమయంలో సుశాంత్‌తో మాట్లాడి ఉంటే బావుండేదని ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. జీవితంలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కొవాలన్న విషయంపై తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సుశాంత్‌ ఆత్మహత్యపై స్పందిస్తూ.. ”సుశాంత్‌ మరణం నన్ను కలిచివేసింది. ‘అయితే దాని కన్నా సుశాంత్‌కి సంబంధించిన ఒక విషయం నన్ను ఇంకా బాధపడేలా చేసింది. అదేంటంటే ఒకసారి సుశాంత్‌ని నేను ముంబయిలో కలిశాను. అప్పుడు సుశాంత్‌  పొడుగైన జుట్టుతో ఉన్నాడు. సుశాంత్‌ ఎంఎస్‌ ధోని సినిమాలో నటిస్తున్నాడని కొంతమంది నాకు చెప్పారు. కానీ నేను మాట్లాడకుండా వెళ్లిపోయా. ఆ సమయంలో  నేను  సుశాంత్‌తో మాట్లాడి ఉంటే.. నా జీవితంలో  ఎదుర్కొన్న సమస్యలను అతడితో పంచుకునే వాడిని. అప్పుడు అతనికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యం వచ్చేది. అలా మాట్లాడనందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను’ అని అన్నారు.

ఇక మనకు బాధ, డిప్రెషన్‌ ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న వారితో అది పంచుకుంటే కొంత వరకు బయటపడొచ్చని షోయబ్ అన్నారు. తాను డిప్రెషన్‌తో బాధపడ్డానని, ఆ తరువాత ఎదుర్కొన్నానని దీపికా కూడా అందరితో చెప్పిందని.. సుశాంత్ కూడా చికిత్స తీసుకొని.. ధైర్యంగా తన సమస్యలను స్నేహితులతో పంచుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో అని షోయబ్ పేర్కొన్నారు. కాగా డిప్రెషన్‌తో బాధపడుతున్న యంగ్ హీరోర సుశాంత్‌ ఈ నెల 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే.