అల్లరి నరేష్ మరో టీజర్.. మాయలు చేసే ‘బంగారు బుల్లోడు’

కామెడీ హీరోగానే కాకుండా.. విలక్షణ పాత్రల్లో సైతం నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హీరో అల్లరి నరేష్. గమ్యం, నేను, ప్రాణం, శంబో శివ శంభో, మహర్షి సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు నరేష్. ప్రస్తుతం నాంది, బంగారు బుల్లోడు చిత్రాల్లో...

అల్లరి నరేష్ మరో టీజర్.. మాయలు చేసే 'బంగారు బుల్లోడు'
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 4:40 PM

కామెడీ హీరోగానే కాకుండా.. విలక్షణ పాత్రల్లో సైతం నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హీరో అల్లరి నరేష్. గమ్యం, నేను, ప్రాణం, శంబో శివ శంభో, మహర్షి సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు నరేష్. ప్రస్తుతం నాంది, బంగారు బుల్లోడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రోజు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా తాను నటించిన చిత్రాల నుంచి టీజర్‌లు విడుదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన నాంది టీజర్ అయితే ఎంతో ఆసక్తికరంగా, నరేష్ నటన అద్భుతంగా ఉంది. టీజర్ చూస్తుంటే ఉత్కంఠతో పాటు భయానికి కూడా గురి చేసింది.

తాజాగా ఇప్పుడు నరేష్ నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా నుంచి మరో టీజర్‌ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నాంది టీజర్‌కు మొత్తం రివర్స్‌గా కామెడీగా ఈ టీజర్ ఉంది. ఇందులో మరోసారి అల్లరి నరేష్ తన కామెడీతో అందరినీ నవ్వించాడు. హస్యంతో పాటు చివర్లో కాస్త సెంటిమెంట్‌ అంశాల్ని చూపించి సినిమాపై ఆసక్తిని పెంచింది చిత్ర బృందం. కాగా బంగారు బుల్లోడు సినిమాకు పీవీ గిరి దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించారు.

Read More: 

బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి.. డిప్యూటీ మేనేజర్ సస్పెండ్..

Latest Articles