Jawan Movie: ఏమాత్రం తగ్గని బాద్‌షా రేంజ్‌.. కళ్లు చెదిరే ధరకు షారుఖ్‌ సినిమా హక్కులు..

Jawan Movie: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'జవాన్‌'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌, పోస్టర్‌లు..

Jawan Movie: ఏమాత్రం తగ్గని బాద్‌షా రేంజ్‌.. కళ్లు చెదిరే ధరకు షారుఖ్‌ సినిమా హక్కులు..
Jawan movie non theatrical rights

Updated on: Sep 25, 2022 | 1:35 PM

Jawan Movie: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జవాన్‌’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాలో షారుఖ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జీరో’. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే నాలుగేళ్ల నుంచి కొత్త సినిమా రాకపోయినా షారుఖ్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

దీనికి నిదర్శనమే జవాన్‌ చిత్రానికి పలికిన నాన్‌ థియేట్రికల్‌ హక్కులు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్‌ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో కలుపుకొని ఈ సినిమా హక్కులు ఏకంగా రూ. 250 కోట్లకు డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. షారుఖ్‌ ఖాన్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు అనకడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అంటూ ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే షారుఖ్‌ ఇందులో డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలతో తెరకెక్కుతోన్న జవాన్‌ ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us