Gudipudi Srihari: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

ఈ ఉదయాన్నే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి మాతృ వియోగం కలిగిందనే వార్త అందరినీ కలచివేసింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరో విషాదకర వార్త వెలుగులోకి వచ్చింది.

Gudipudi Srihari: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత
Gudipudi Srihari

Updated on: Jul 05, 2022 | 1:00 PM

Senior Journalist Gudipudi Srihari: గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో అటు మీడియా ఫీల్డ్‌లో పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఉదయాన్నే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి మాతృ వియోగం కలిగిందనే వార్త అందరినీ కలచివేసింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరో విషాదకర వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా మరో ప్రముఖుడు కన్ను మూశారనే వార్త అందరినీ కలచివేసింది. సుమారు అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

శ్రీహరి పలు ప్రముఖ పత్రికలలో పని చేశారు. సుమారు 55 ఏళ్ల పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని రచించారు. గుడిపూడి శ్రీహరికి 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం ‘పత్రికా రచన’ లో “కీర్తి పురస్కారాన్ని” ప్రకటించింది. 1969 నుండి ది హిందూ పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం, రివ్యూ రాయటం ఆయన చేసిన కృషికి నిదర్శనం. శ్రీహరి భార్య లక్ష్మి గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.విదేశాల్లో ఉన్న కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. గుడిపూడి శ్రీహరి మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి