Jagapathi Babu: పుట్టిన రోజున గొప్ప నిర్ణయం తీసుకున్న సీనియర్‌ నటుడు.. ఆయన స్ఫూర్తితో మరో వంద మంది సైతం..

|

Feb 12, 2022 | 7:54 AM

దేశంలో చాలా మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అవ‌య‌వ మార్పిడి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్నారు.

Jagapathi Babu: పుట్టిన రోజున గొప్ప నిర్ణయం తీసుకున్న సీనియర్‌ నటుడు.. ఆయన స్ఫూర్తితో మరో వంద మంది సైతం..
Follow us on

దేశంలో చాలా మంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అవ‌య‌వ మార్పిడి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్నారు. అయితే సరైన సమయానికి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, క‌ళ్లు, చ‌ర్మం, చేతులు తదితర అవయవాలు దొరక్కపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అవయవదానం  (Organ Donation) పై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈక్రమంలో అవ‌య‌వ దానంపై అవ‌గాహ‌న పెంచేందుకు టాలీవుడ్ సీనియర్‌ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు (Jagapathi Babu) ముందుకొచ్చారు. తన పుట్టిన రోజు (ఫిబ్రవరి12) ను పురస్కరించుకుని మ‌ర‌ణానంత‌రం తాను అవ‌య‌వ‌దానం చేయనున్నట్లు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన అభిమానులు కూడా ఈ అవయవదానానికి ముందుకు రావాలని జగపతిబాబు పిలుపునిచ్చారు. కాగా ఆయనిచ్చిన పిలుపుమేరకు మరో 100 మంది వరకు తాము సైతం అవయవదానం చేస్తామంటూ వేర్వేరు చోట్ల ప్రతిజ్ఞ చేశారు.

అందుకే ఈ నిర్ణయం..

కాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అవయవదానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. నటుడు జగపతిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రకటన చేశారు. ‘జన్మదినం సంద‌ర్భంగా ఏదైనా ప‌దిమందికి ఉపయోగపడే మంచి పని చేయాలనుకున్నాను. అయితే అవ‌య‌వ‌దానానికి మించిన మంచి పని లేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం మరింత మందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నాను. నా అభిమానులంతా అవ‌య‌వ‌దానం చేయ‌డానికి ముందుకురావాలి. దీనివ‌ల్ల మనం మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా అమ‌రులుగా మిగిలిపోతారు’ అని సీనియర్‌ నటుడు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప‌రిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల‌ ముఖ్య కార్యదర్శి జ‌యేష్ రంజ‌న్‌, ఆస్పత్రి ప్రతినిధులు జగపతి బాబును ఘనంగా సన్మానించారు.

Also Read:Sidhu’s daughter Rabia: కాంగ్రెస్‌‌లో కుంపటి రాజేసిన సిద్దూ కూతురు రబియా వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే!

Vijayawada Crime: సవతి తండ్రి కర్కశత్వం.. వరసకు కూతురైన బాలికతో..

Horoscope Today: ఈరోజు ఈరాశి వారు శుభవార్త వింటారు .. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..