Sidhu’s daughter Rabia: కాంగ్రెస్‌లో కుంపటి రాజేసిన సిద్దూ కూతురు రబియా వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే!
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పంజాబ్ కాంగ్రెస్ ఛీప్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూతురు పొలిటికల్ బాంబ్ పేల్చారు. రబియా సిద్ధూ వ్యాఖ్యలు పంజాబ్ కాంగ్రెస్ కుంపటిలో చిచ్చు రాజేసింది.

Navjot Singh Sidhu’s daughter Rabia: 5 రాష్ట్రాలతో పాటు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు(Punjab Assembly Election 2022) జరుగుతున్న వేళ పంజాబ్‌లో రాజకీయాలు కాకలు రేగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పంజాబ్ కాంగ్రెస్ ఛీప్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూతురు పొలిటికల్ బాంబ్ పేల్చారు. పంజాబ్ కాంగ్రెస్(Punjab Congress) కుంపటిలో చిచ్చు రాజేసింది ఆపార్టీ ఛీప్ నవజ్యోత్ సింగ్ కూతురు రబియా సిద్దూ. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమత్ సర్ ఈస్ట్ ప్రచారంలో పాల్గొన్న రబీయా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మా నాన్న గెలిచే వరకు నో మ్యారేజ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక.. సీఎం అభ్యర్థి చన్నీపై ఉన్న అక్కసును బయటపెట్టింది. చన్నీ అవినీతికి పాల్పడ్డారని.. ఆయన బ్యాంకు ఖాతాను చెక్ చేయాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బ్యాంకు అకౌంట్‌లో రూ.133 కోట్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రబీయా. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు. తన తండ్రి సిద్దూ 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నారని ఓటర్లకు చెప్పారు. పంజాబ్‌ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని రబియా సిద్ధూ ఆశాభావం వ్యక‍్తం చేశారు.
#WATCH | Punjab PCC chief Navjot S Sidhu’s daughter, Rabia Kaur Sidhu speaks on Charanjit Channi being made CM face for #PunjabElections2022
“Maybe they (high command) had some compulsion. But you can’t stop an honest man for long. Dishonest man has to eventually stop,” she says pic.twitter.com/DzzsauNMJB
— ANI (@ANI) February 11, 2022
అసలే ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పాంచ్ పటాకా మోగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతుంటే.. రబీయా సిద్దూ చేసిన వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయోనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్వయాన రాష్ట్ర పార్టీ ఛీప్ కూతురే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రతిపక్షాల విమర్శలకు మరింత ఆజ్యం పోసినట్టవుతుందని చెబుతున్నారు. అసలే ఆప్ నుంచి గట్టి పోటీ నెలకొన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఈఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్‌జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతుండగా రబీయా సిద్దూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.