AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada Crime: సవతి తండ్రి కర్కశత్వం.. వరసకు కూతురైన బాలికతో..

వరసకు వరసైన కూతురిలో ఓ సవతి తండ్రి(Step Father) అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రిగా ఆదరించాల్సింది పోయి రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. వావి వరసలు వరసలు మరచి అమానుషంగా..

Vijayawada Crime: సవతి తండ్రి కర్కశత్వం.. వరసకు కూతురైన బాలికతో..
Sex Harasmnet
Ganesh Mudavath
|

Updated on: Feb 12, 2022 | 7:04 AM

Share

వరసకు వరసైన కూతురిలో ఓ సవతి తండ్రి(Step Father) అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రిగా ఆదరించాల్సింది పోయి రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. వావి వరసలు వరసలు మరచి అమానుషంగా వ్యవహరించాడు. బాలిక బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. విషయాన్ని గమనించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం(Pocso Act) కింద కేసు నమోదైంది. విజయవాడలోని వన్‌టౌన్‌ గట్టు వెనుక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు కుమారుడు, కూతురు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా అతనితో విడిపోయి రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది.

ఈ క్రమంలో ఈ నెల 4న బాత్రూమ్ లో బాలిక స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ తో రికార్డ్ చేశాడు. గురువారం ఉదయం మహిళ తన రెండో భర్త చరవాణిలోని ఫొటోలు చూస్తుండగా కూతురు స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. ఈ విషయమై రెండో భర్తతో గొడవ పడింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Also Read

Indian Embassy: ఇరాన్‌లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి.. భారత మారిటైమ్ యూనియన్ చొరవతో విడుదల

TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు.. షరతులతో..

Ind vs WI 3rd ODI: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. రాణించిన శ్రేయస్, పంత్, ప్రసిద్ధ్, సిరాజ్